అఫీషియల్: 'నారప్ప' డైరెక్ట్ ఓటిటి రిలీజ్..
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్, అందాల తార ప్రియమణి జంటగా నటించిన 'నారప్ప' చిత్రం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్ర నిర్మాత సురేష్ బాబు ఓటిటి రిలీజ్ వైపు వెళతారా లేక థియేటర్స్ లోనే ఈ చిత్రాన్ని తీసుకువస్తారా అనే ఉత్కంఠ నెలకొని ఉండేది. ఆ ఉత్కంఠకు నేటితో తెరపడింది.
నారప్ప చిత్రాన్ని నేరుగా ఓటిటిలోనే రిలీజ్ చేయనున్నారు. తాజాగా అధికారికంగా ప్రకటించేశారు. ఈ చిత్రాన్ని జూలై 20న అమెజాన్ ప్రైమ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ధనుష్ అసురన్ చిత్రానికి రీమేక్ గా నారప్ప తెరకెక్కింది. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని దర్శకుడు.
ఈ విలేజ్ యాక్షన్ డ్రామాలో వెంకీ, ప్రియమణి భార్య భర్తలుగా నటించారు. యువ నటుడు కార్తిక్ రత్నం కీలక పాత్రలో నటించాడు. కరోనా వల్ల చాలా రోజులుగా నారప్ప రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఓటిటిలో రిలీజ్ చేయాలా లేక థియేటర్లల్లోనే విడుదల చేయాలా అని నిర్మాత సురేష్ బాబు చాలా కాలం ఆలోచించారు. చివరకు ఓటిటి వైపే మొగ్గు చూపారు.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల కాలంలో వెంకటేష్ ఈ తరహా మాస్ లుక్ లో నటించడం ఇదే తొలిసారి. మరోవైపు వెంకటేష్ 'దృశ్యం 2'లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా ఓటిటిలోనే రిలీజ్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి.
లాక్ డౌన్ ఎత్తివేయడంతో థియేటర్స్ పునః ప్రారంభానికి రంగం సిద్ధం అవుతోంది. ఈ తరుణంలో ఓటిటిలో రిలీజ్ లు వద్దని టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. కానీ సురేష్ బాబు మాత్రం నారప్ప చిత్రాన్ని ఓటిటిలోనే రిలీజ్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments