సెప్టెంబర్ 3న వస్తున్న 'నారదుడు'

  • IndiaGlitz, [Thursday,September 01 2016]

సూరజ్ ప్రొడక్షన్స్ -టు అవర్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఉమ-వై.వి.సత్యనారాయణ సంయుక్త్రంగా నిర్మిస్తున్న చిత్రం "నారదుడు".
ధనుష్-జెనీలియా-శ్రియ జంటగా.. జవహర్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రానికి తెలుగు అనువాద రూపమిది. "బిచ్చగాడు" కధానాయకుడు విజయ్ ఆంటోనీ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్మాతలు మాట్లాడుతూ.. "ధనుష్ పెర్ఫార్మెన్స్, జెనీలియా, శ్రియల గ్లామర్ తో పాటు ప్రతి సన్నివేశంలోనూ పండే కడుపుబ్బ నవ్వించే కామెడీ, విజయ్ ఆంటోని సంగీతం, శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు "నారదుడు" చిత్రానికి ముఖ్య ఆకర్షణలు. ధనుష్ సినిమా నుంచి సగటు ప్రేక్షకుడు కోరుకొనే అంశాలన్నీ పుష్కలంగా మేళవించిన చిత్రమిది. "అభినవ నారదుడు" లాంటి ధనుష్ పాత్ర ఇటు మాస్.. అటు క్లాస్ ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో అలరిస్తుంది. సెప్టెంబర్ 3న అత్యధిక ధియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అన్నారు.

More News

ఈనెల 3న ధనుష్ , కీర్తి సురేష్ ల రైల్ ఆడియో

రఘువరన్ బి.టెక్,అనేకుడు,మాస్,మరియన్...ఇలా విభిన్న కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో ధనుష్,

రజనీ సరసన అమల..!

సూపర్ స్టార్ రజనీకాంత్...గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రోబో 2.0చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

జనతా గ్యారేజ్ - రాజమౌళి రివ్యూ..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం జనతా గ్యారేజ్.

గ్యారేజ్ లో శంకర్ ట్రైలర్ కు విశేష స్పందన..!

నారా రోహిత్-రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం శంకర.

శాతకర్ణిలో హేమమాలిని, శ్రియ గెటప్స్ ఇవే..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్నవందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.