మంత్రి పద్మారావు చేతుల మీదుగా 'నారదుడు' పాటల విడుదల

  • IndiaGlitz, [Sunday,August 07 2016]

ధనుష్-జెనీలియా-శ్రియ జంటగా.. జవహర్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో "నారదుడు" పేరుతో అనువదిస్తుండడం తెలిసిందే. సూరజ్ ప్రొడక్షన్స్-టు అవర్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఉమ-వై.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని సంయుక్త్రంగా నిర్మిస్తున్నారు.

అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. "బిచ్చగాడు" చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోని సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రానికి భువన చంద్ర-వెన్నెలకంటి-శివ గణేష్ సాహిత్యం సమకూర్చారు. తెలంగాణ మంత్రివర్యులు టి.పద్మారావు ముఖ్య అతిధిగా హాజరై ఆడియోతో పాటు ధియేటర్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, డియస్పీ వరుణ్ రెడ్డి, రాజ్ కందుకూరి, సింగర్ మధు, ప్రతాని రామకృష్ణ గౌడ్, సాయి వెంకట్ తదితరులు ఈ వేడుకలో పాలు పంచుకున్నారు. పాటలు, ట్రైలర్ చాలా బాగున్నాయని, తమిళంలో కంటే తెలుగులో ఈ చిత్రం మరింత పెద్ద విజయం సాధించాలని మంత్రి పద్మారావుతోపాటు మిగతా అతిథులంతా ఆకాక్షించారు. స్ట్రెయిట్ సినిమాలు తీసే ముందు..

సినిమా రంగంపై అవగాహన పెంచుకునేందుకు కొన్ని డబ్బింగ్ సినిమాలు చేస్తున్నామని.. త్వరలో తమ బ్యానర్ నుంచి "పిజ్జా-3" అనే మరో డబ్బింగ్ చిత్రం రానుందని నిర్మాతలు ఉమ-వై.వి.సత్యనారాయణ పేర్కొన్నారు. ఆడియో వేడుకకు విచ్చేసే తమను ఆశీర్వదించిన మంత్రివర్యులు పద్మారావుతోపాటు మిగతా అతిధులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అతి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు.

More News

చిరుకు థ్యాంక్స్ తెలియచేసిన శ్రీరస్తు శుభమస్తు టీమ్..

అల్లు శిరీష్-లావణ్య జంటగా పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు.

మమ్మల్ని కామెంట్ చేసిన వాళ్లకు అదే సమాధానం - హీరో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ,రీతూవర్మ జంటగా నూతన దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన విభిన్న కథాచిత్రం పెళ్లిచూపులు. ఈ చిత్రాన్ని రాజ్ కందుకూరి,యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు.

నంద‌మూరి హీరో - మెగా హీరో భారీ మ‌ల్టీస్టార‌ర్ ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇజం చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

అరణ్యంలో ట్రైలర్ విడుదల

రోషిత్,షాలు,చరణ్ నాయుడు,కరుణాకర్,కళ్యాణి ముఖ్య పాత్రల్లో ..సుదర్శన్ రెడ్డి పాల్వాయి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అరణ్యంలో...

'అత్తారిల్లు' ఆల్ ఏరియా రైట్స్ సొంతం చేసుకున్న శ్రీలక్ష్మి పిక్చర్స్

అంజన్ కళ్యాన్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంలో మెలోడీబ్రహ్మ మణిశర్మ నేపధ్యసంగీతంలో అంజన్ కే కళ్యాణ్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన 'అత్తారిల్లు'