మంత్రి పద్మారావు చేతుల మీదుగా 'నారదుడు' పాటల విడుదల

  • IndiaGlitz, [Sunday,August 07 2016]

ధనుష్-జెనీలియా-శ్రియ జంటగా.. జవహర్ దర్శకత్వంలో తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో "నారదుడు" పేరుతో అనువదిస్తుండడం తెలిసిందే. సూరజ్ ప్రొడక్షన్స్-టు అవర్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఉమ-వై.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని సంయుక్త్రంగా నిర్మిస్తున్నారు.

అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. "బిచ్చగాడు" చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోని సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రానికి భువన చంద్ర-వెన్నెలకంటి-శివ గణేష్ సాహిత్యం సమకూర్చారు. తెలంగాణ మంత్రివర్యులు టి.పద్మారావు ముఖ్య అతిధిగా హాజరై ఆడియోతో పాటు ధియేటర్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, డియస్పీ వరుణ్ రెడ్డి, రాజ్ కందుకూరి, సింగర్ మధు, ప్రతాని రామకృష్ణ గౌడ్, సాయి వెంకట్ తదితరులు ఈ వేడుకలో పాలు పంచుకున్నారు. పాటలు, ట్రైలర్ చాలా బాగున్నాయని, తమిళంలో కంటే తెలుగులో ఈ చిత్రం మరింత పెద్ద విజయం సాధించాలని మంత్రి పద్మారావుతోపాటు మిగతా అతిథులంతా ఆకాక్షించారు. స్ట్రెయిట్ సినిమాలు తీసే ముందు..

సినిమా రంగంపై అవగాహన పెంచుకునేందుకు కొన్ని డబ్బింగ్ సినిమాలు చేస్తున్నామని.. త్వరలో తమ బ్యానర్ నుంచి "పిజ్జా-3" అనే మరో డబ్బింగ్ చిత్రం రానుందని నిర్మాతలు ఉమ-వై.వి.సత్యనారాయణ పేర్కొన్నారు. ఆడియో వేడుకకు విచ్చేసే తమను ఆశీర్వదించిన మంత్రివర్యులు పద్మారావుతోపాటు మిగతా అతిధులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అతి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు.