ఒకే రోజు 2 సినిమాలు స్టార్ట్ చేస్తున్న నారా రోహిత్
Send us your feedback to audioarticles@vaarta.com
వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకుం టు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న యంగ్ హీరో నారా రోహిత్. ఒకే రోజు రెండు చిత్రాలను స్టార్ట్ చేస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 17న ఆ...రెండు చిత్రాలను ప్రారంభిస్తున్నారు. ఈ రెండు చిత్రాలను ఓకే సంస్థ నిర్మిస్తుండడం విశేషం.
ఇంతకీ నారా రోహిత్ తో వరసగా రెండు చిత్రాలను నిర్మిస్తున్న సంస్థ ఏమిటనుకుంటున్నారా..? వారాహి చలన చిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నారు. ఇందులో ఒక చిత్రానికి అవసరాల శ్రీనివాస్ దర్శకుడు కాగా మరో చిత్రాన్ని ప్రదీప్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించనున్నారు. రెండు విభిన్న కధాంశాలతో రూపొందుతున్న ఈ రెండు చిత్రాలు తనకు మంచి పేరు తీసుకువస్తాయంటున్నాడు నారా రోహిత్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments