పున్నమి ఘాట్ లో పుష్కర స్నానం చేసిన హీరో నారా రోహిత్
Send us your feedback to audioarticles@vaarta.com
విభిన్న కథలతో అభిమానులను అలరిస్తూ ఎప్పుడు షూటింగ్స్ తో బిజీ గా ఉండే నారా రోహిత్ బుధవారం నాడు విజయవాడ పున్నమి ఘాట్లో పుష్కర స్నానం చేసారు . గొల్లపూడి నుండి అభిమానులు కోలాహాలంతో ర్యాలీగా తీసుకెళ్లారు ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ .....
మొదటిసారిగా కృష్ణాపుష్కరాల్లో స్నానం చేసానని ఏర్పాట్లు చాల అద్భుతంగా ఉన్నాయనిప్రభుత్వంతో పాటు స్వచ్ఛందసంస్థలు .ప్రజలు కూడా భక్తులకు ఆహార పొట్లాలు మజ్జిగ ప్యాకెట్లు అందించడం చాల ఆనందంగా ఉందన్నారు .ముక్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన ఘాట్ల లో మాత్రమే పుణ్యస్నానాలు చెయ్యాలని పిలుపునిచ్చారు . నారా మరియు నందమూరి అభిమానులు అందరు వాలంటీర్లుగా ఉండీ భక్తులకు ఎటువంటిఅసౌకర్యాలు కలగకుండా చూడాలని పిలుపునిచ్చారు .పుష్కర స్నానం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలుసుకున్నారు .
నారా రోహిత్ తో పాటు నారా అభిమానులు మరియు నందమూరి అభిమానులు భారీసంఖ్యలో పాల్గొన్నారు . నారా రోహిత్ నటిస్తున్న అప్పట్లోఒకడుండేవాడు షూటింగ్ జరుపుకుంటుంది ఆల్రెడీ షూటింగ్ పూర్తిచేసుకున్న జ్యో అచ్యుతానంద సినిమా ఈ నెల 21న ఆడియో . సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలకానుంది
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com