నారా రోహిత్ సావిత్రి కథ ఇదే..
- IndiaGlitz, [Tuesday,March 29 2016]
నారా రోహిత్ - నందిత జంటగా నటించిన చిత్రం సావిత్రి. ప్రేమ ఇష్క్ కాదల్ ఫేం పవన్ సాదినేని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సావిత్రి కథ అంటూ ఓ కథ ప్రచారంలో ఉంది. ఇంతకీ సావిత్రి కథ ఏమిటంటే...సావిత్రి (నందిత)కి ఒక అక్క ఉంటుంది. అక్క పెళ్లి జరుగుతుంటే...చెల్లెలు సావిత్రికి అసలు విషయం తెలుస్తుంది. అక్క ఎవర్నో ప్రేమించిందని. ఇంకేముంది అక్క పెళ్లి చేసుకోకుండా పారిపోతానంటే సహకరిస్తుంది సావిత్రి. అయితే సావిత్రి అక్కకు సహకరించడానికి ఓ కారణం ఉందట. అదేమిటంటే... చిన్నప్పటి నుంచి సావిత్రికి పెళ్లి అంటే ఇష్టం అట. అక్క వెళ్లిపోతే ఆ పెళ్లికొడుకుతో నాకు పెళ్లి చేస్తారని సావిత్రి అలా చేస్తుందట.
సావిత్రి అక్క వెళ్లిపోయిన తర్వాత సావిత్రితో ఆంటీ అంటుందట..మీ అక్క చేసిన పనికి నిన్ను ఎవరూ.. పెళ్లిచేసుకోరు అని సావిత్రితో అంటుందట. నేను ఒకలా అనుకుంటే ఇంకోలా జరిగేలా ఉందని సావిత్రి పారిపోయిన అక్కను తీసుకువచ్చి పెళ్లి చేస్తుందట. హమ్మయ్యా..అనుకుని ఫ్యామిలీ అంతా షిర్డీకి ప్రయాణం అవుతారట. రైలు ప్రయాణంలో సావిత్రి అదే నందిత హీరో నారా రోహిత్ ప్రేమలో పడుతుందట. రోహిత్ తొలిచూపులోనే సావిత్రి ప్రేమలో పడతాడట. రోహిత్ ఫ్యామిలీ మెంబర్స్ కి తన ప్రేమ విషయం చెప్పేలోపే ఓ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేస్తారట. అమ్మాయి తండ్రికి రోహిత్ ఫోన్ చేసి నేను ఓ అమ్మాయిని ప్రేమించాను వేరే సంబంధం చూసుకోండి అని చెబుతాడట.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే...రోహిత్ ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లి ఫిక్స్ చేసిందో ఎవరితోనో కాదు సావిత్రితోనే అట. ఇదిలా ఉంటే...తన ప్రేమ - పెళ్లిని చెడగొట్టిందని రవిబాబు సావిత్రి పై పగ తీర్చుకోవాలని వెతుకుతుంటాడట. చివరికి తను ప్రేమించిన సావిత్రిని ఎలా పెళ్లి చేసుకున్నాడనేదే మిగిలిన కథ అంటూ సావిత్రి కథ ప్రచారంలో ఉంది. ఇంట్రస్టింగ్ గా ఉన్న ఇదే సావిత్రి కథ అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనిపిస్తుంది. మరి సావిత్రి కథ ఇదేనా కాదా..? ఇదే అయితే ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది తెలియాలంటే ఏప్రిల్ 1 వరకు ఆగాల్సిందే.