నారా రోహిత్.. నవంబర్ 10 స్పెషల్
Send us your feedback to audioarticles@vaarta.com
బాణం, సోలో, ప్రతినిధి, రౌడీ ఫెలో, జో అచ్యుతానంద చిత్రాలతో ఆకట్టుకున్న కథానాయకుడు నారా రోహిత్. డిఫరెంట్ పాత్రలకు చిరునామాలా ఉండే రోహిత్.. ప్రస్తుతం బాలకృష్ణుడు చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రెజీనా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి పవన్ మల్లెల దర్శకత్వం వహిస్తున్నాడు. రమ్యకృష్ణ ఓ పవర్ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతమందించాడు.
కాగా, ఈ చిత్రంలోని పాటలను ఈ నెల 10న విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. అదే రోజున నారా రోహిత్‌కి సంబంధించి మరో ఆసక్తికరమైన అంశమేమిటంటే.. మంచు మనోజ్ కథానాయకుడిగా నటించిన ఒక్కడు మిగిలాడు చిత్రానికి ఆయన వాయిస్ ఓవర్ అందించారు. మంచు మనోజ్ రెండు పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అజయ్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు.
ఇలా.. ఒకే రోజున రెండు రకాలుగా నారా రోహిత్ సందడి చేయనున్నారన్నమాట. సో.. ఈ నవంబర్ 10 ఆయనకి స్పెషల్ అనే చెప్పాలి. బాలకృష్ణుడు ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments