నిర్మాతల హీరో, వర్క్ హాలిక్...నారా రోహిత్
Send us your feedback to audioarticles@vaarta.com
తొలిచిత్రం బాణం` నుండి విలక్షణ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన యంగ్ హీరో నారా రోహిత్. సోలో, ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర` చిత్రాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలను నిర్మిస్తూ అందులో కొత్త టెక్నిషియన్స్, దర్శకులను ఎంకరేజ్ చేస్తున్నారు.
నారా రోహిత్ ప్రస్తుతం రాజా చెయ్యివేస్తే`, సావిత్రి` సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి. రాజా చెయ్యివెస్తే` సినిమా నూతన దర్శకుడు ప్రదీప్ దర్శకత్వంలో సాయికొర్రపాటి నిర్మాతగా వారాహి చలనచిత్రం బ్యానర్‌పై రూపొందుతుండగా, సావిత్రి` సినిమావిజన్ ఫిలింమేకర్స్ బ్యానర్‌పై బి.రాజేంద్రప్రసాద్ నిర్మాతగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
ఈ రెండు సినిమాలు ఓకే సమయంలో జరుగుతుండటంతో నారా రోహిత్ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రాజా చెయ్యివేస్తే` చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అలాగే సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు సావిత్రి` సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా నారా రోహిత్ చిత్రీకరణలో పాల్గొంటుండటం ఆయనకు సినిమా పట్ల ప్యాషన్, డేడికేషన్‌ను తెలియజేస్తున్నాయి. నిర్మాతల మేలు కోరే ఇలాంటి హీరోలే ప్రస్తుతం ఇండస్ట్రీకి కూడా అవసరం
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments