కీలక పాత్రలో నారా రోహిత్....
Send us your feedback to audioarticles@vaarta.com
బాణం సినిమాతో నారా రోహిత్‌ను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు చైతన్య దంతులూరి తర్వాత బసంతి అనే సినిమాను డైరెక్ట్ చేశారు. చాలా గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పుడు నారా రోహిత్‌తో 1971 ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో ఓ పీరియాడిక్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నారా రోహిత్ హీరోగా నటిస్తారని వార్తలు వినిపించాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నారా రోహిత్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రోహిత్ నటిస్తూనే.. నిర్మాతగా కూడా మారి సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రవీందర్ ఆర్ట్ వర్క్ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments