కీల‌క పాత్ర‌లో నారా రోహిత్‌....

  • IndiaGlitz, [Tuesday,July 31 2018]

బాణం సినిమాతో నారా రోహిత్‌ను హీరోగా ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు చైత‌న్య దంతులూరి త‌ర్వాత బ‌సంతి అనే సినిమాను డైరెక్ట్ చేశారు. చాలా గ్యాప్ తీసుకున్న ఆయ‌న ఇప్పుడు నారా రోహిత్‌తో 1971 ఇండో పాక్ యుద్ధ నేప‌థ్యంలో ఓ పీరియాడిక్ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నారా రోహిత్ హీరోగా న‌టిస్తార‌ని వార్త‌లు వినిపించాయి.

అయితే తాజా సమాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో నారా రోహిత్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో రోహిత్ న‌టిస్తూనే.. నిర్మాత‌గా కూడా మారి సినిమాను రూపొందించడానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ర‌వీంద‌ర్ ఆర్ట్ వ‌ర్క్ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది.