మెగా హీరోయిన్ తో నారా రోహిత్...

  • IndiaGlitz, [Monday,May 29 2017]

తొలి సినిమానుండి విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తున్న నారా రోహిత్ ఇప్పుడు శ‌మంత‌క మ‌ణి అనే మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో నారారోహిత్ సినిమా చేయ‌నున్నాడు. గ‌త ఏడాది నారా రోహిత్ హీరోగా ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలోసావిత్రి సినిమా రూపొందిన సంగ‌తి తెలిసిందే.
ఇప్పుడు ఈ కాంబోలో మ‌రో సినిమా రూపొంద‌నుంది. ఈ సినిమాలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌య నిహారిక హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. నిహారిక న‌టించిన తొలి సినిమా ఒక మ‌న‌సు డిజాస్ట‌ర్ అయ్యింది. త‌ర్వాత నిహారిక మ‌రో సినిమాలో న‌టించ‌లేదు. ఇప్పుడు నారా రోహిత్‌తో న‌టిస్తుంద‌ని విన‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొంత‌కాలం ఆగాల్సిందే..