వెంకీ త‌మ్ముడిగా రోహిత్‌?

  • IndiaGlitz, [Monday,January 22 2018]

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు వెంక‌టేష్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. అతి త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. 'ఆటా నాదే వేటా నాదే' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ సినిమాకి యువ సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్ సంగీత‌మందించ‌నున్నారు.

క‌థానాయిక ఎంపిక పూర్తి కాని ఈ సినిమాకి సంబంధించి.. ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త టాలీవుడ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇంత‌కీ అదేమిటంటే.. యువ క‌థానాయ‌కుడు నారా రోహిత్ ఈ చిత్రంలో వెంకీ త‌మ్ముడి పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్నాడట‌. గ‌తంలోనే ఈ చిత్రం విష‌యంలో నారా రోహిత్ పేరు వినిపించినా.. అత‌నిది నెగెటివ్ రోల్ అని క‌థ‌నాలు వ‌చ్చాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. వెంకీ సోద‌రుడు పాత్ర‌లో ఆయ‌న న‌టించే అవ‌కాశ‌ముందని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

ముంబయికి వెళ్ళనున్న నాగ్, వర్మ

‘శివ’వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో సంచలనానికి తెరలేపిన ద్వయం కింగ్ నాగార్జున,దర్శకుడు రాంగోపాల్ వర్మ.

చ‌ర‌ణ్‌.. ఇద్ద‌రు అన్నయ్య‌లు

ఈ ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రెండు సినిమాలు విడుదల కానున్నాయి. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'రంగస్థలం' మార్చి 30న విడుదల కానుండగా....ఇక ఇటీవల చిత్రీకరణ ప్రారంభించుకున్న‌ బోయపాటి శ్రీను సినిమాని కూడా ఈ ఏడాదిలోనే విజయదశమి సంద‌ర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఫిలిం నగర్ దైవ సన్నిదానం చైర్మన్ గా డా.మోహన్ బాబు

ఫిలిం నగర్ దైవ సన్నిదానం చైర్మన్ పదవికి  డా. మోహన్ బాబు గారు నేడు ప్రమాణ స్వీకారం చేసారు.

మళ్ళీ నటిస్తానంటున్న బాపు బొమ్మ

దివ్యవాణి....తాను బాపుగారి బొమ్మ.... తెలుగు ప్రేక్షకులలో తనదైన ముద్రవేసుకుందీ ముద్దుగుమ్మ...

ఎన్టీఆర్ పాత్రలో నాని...

వరుస విజయాలను సాధిస్తున్న నేచరల్ స్టార్ నాని ప్రస్తుతం 'కృష్ణార్జున యుద్దం'సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.