ఆటగాళ్ళకి డబ్బింగ్ మొదలెట్టిన నారా రోహిత్ !!

  • IndiaGlitz, [Wednesday,April 04 2018]

సెన్సిబుల్ యాక్టర్ నారా రోహిత్, స్టైలిష్ విలన్ జగపతిబాబు కలిసి నటించిన ఇంటిలిజెంట్ థ్రిల్లర్ 'ఆటగాళ్లు'. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నారా రోహిత్ సరసన హీరోయిన్ గా దర్శనా బానిక్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న విషయం తెలిసిందే. ఇవాళ చిత్ర కథానాయకుడు నారా రోహిత్ ఈ చిత్రానికి డబ్బింగ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర మాట్లాడుతూ..మేం ఊహించినదానికంటే అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. ఇవాళ డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. మా హీరో నారా రోహిత్ ఇవాళ డబ్బింగ్ ఆరంభించారు. దర్శకుడు మురళి ఆటగాళ్లు చిత్రాన్ని అద్భుతంగా మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.నారా రోహిత్-జగపతిబాబుల పాత్రలు ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకొంటాయి. త్వరలో ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల చేసి వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నాం అన్నారు. 

ఈ చిత్రానికి మాటలు: గోపి, కెమెరా: విజయ్.సి.కుమార్, మ్యూజిక్: సాయికార్తీక్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: ఆర్.కె.రెడ్డి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.సీతారామరాజు, నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పరుచూరి మురళి.

More News

వెంక‌టేష్, తేజ‌ సినిమా మ‌రింత ఆల‌స్యం?

విక్టరీ వెంకటేష్, సంచలన దర్శకుడు తేజ కాంబినేషన్‌లో రూపొంద‌నున్న‌ సినిమాకి సంబంధించి..

బన్నీ బర్త్‌డేకి అభిమానుల స్పెష‌ల్ గిఫ్ట్‌

ఈ ఆదివారం (ఏప్రిల్ 8)  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు.

చిరు చిత్రంలో నిహారిక‌

ఇప్ప‌టి వ‌ర‌కు మెగా ఫ్యామిలీ నుండి ఎక్కువ మంది హీరోలే ప‌రిచ‌యం అయ్యారు.

బన్నీతో తమిళ దర్శకుడి సినిమా?

‘రాజా రాణి’, ‘తెరి’ (తెలుగులో ‘పోలీస్’), ‘మెర్సల్’ (తెలుగులో ‘అదిరింది’) చిత్రాలతో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిపించుకున్నారు తమిళ దర్శకుడు అట్లీ కుమార్.

నాని సినిమా ఇంటర్వెల్ ట్విస్ట్ ఇదేనా!?

నాని ద్విపాత్రాభినయం చేసిన సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు.