డబుల్ ధమాకా ఇవ్వనున్న నారా రోహిత్
Send us your feedback to audioarticles@vaarta.com
'బాణం'లా దూసుకొచ్చిన నారా వారింటి కథానాయకుడు నారా రోహిత్. ప్రారంభంలో ఏడాదికో సినిమా అన్నట్లుగా అడుగులు వేసిన రోహిత్.. ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడంలో వేగం పెంచాడు. ఫలితంగా.. టాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న కథానాయకుడుగా రోహిత్ వార్తల్లోకి ఎక్కుతున్నాడు. ఈ మధ్యే 'తుంటరి'గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోహిత్.. వచ్చే నెలలో రెండు సినిమాలతో పలకరించే దిశగా ఉన్నాడు.
ఆ రెండు సినిమాలే 'సావిత్రి', 'రాజా చెయ్యి వేస్తే'. నందితతో రోహిత్ జోడీ కట్టిన 'సావిత్రి' సినిమా ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఇక ఇషా తల్వార్‌తో కలిసి నటించిన 'రాజా చెయ్యి వేస్తే' కూడా ఏప్రిల్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే దిశగా ఉంది. అంటే.. ఒకే నెలలో రెండు సినిమాలతో నారా రోహిత్ సందడి చేయనున్నాడన్నమాట. డబుల్ ధమాకా ఇవ్వనున్న రోహిత్‌కి ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com