రోహిత్ సావిత్రికి ముఖ్య అతిథిగా బాలయ్య...
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తొలి చిత్రం బాణం నుండి అసుర వరకు విభిన్న కథాంశాలతో సినిమాలను చేస్తున్న హీరో. ప్రతి స్క్రిప్ట్ ను విలక్షణంగా ఎంచుకుంటూ ఇటు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో నారారోహిత్ హీరోగా నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం 'సావిత్రి'.
ప్రేమ ఇష్క్ కాదల్ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీతో ఆడియెన్స్ కు దగ్గరైన దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రవణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని మార్చి 4న నటసింహ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో నిర్వహించనున్నారు. మా క్యూట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సావిత్రి సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. రోహిత్ పెర్ఫార్మన్స్ లో,బాడీ లాంగ్వేజ్ లో ఎంతో ఫ్రెష్నెస్ ఈ చిత్రం లో ఉంటుంది. నారా రోహిత్, నందిత ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఎక్సలెంట్ పెర్ ఫార్మెన్స్ చేశారు. అలాగే రీసెంట్ గా నారా రోహిత్ పాడిన సాంగ్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.
శ్రవణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని మార్చి 4న నిర్వహించనున్నాం. ఈ వేడుకకు నటసింహ నందమూరి బాలకృష్ణగారు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఘనంగా జరగనున్న ఈ ఆడియో వేడుకకు పలువురు సినీ ప్రముఖులు రానున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మార్చి 25న విడుదల చేస్తున్నాం" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com