Prathinidhi 2:'ప్రతినిధి2' మూవీ విడుదల వాయిదా.. రాజకీయ ఒత్తిళ్లే కారణమా..?
Send us your feedback to audioarticles@vaarta.com
నారా రోహిత్ చాలా కాలం తర్వాత తిరిగి హీరోగా నటించిన మూవీ 'ప్రతినిధి2'. 2014లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ 'ప్రతినిధి' సినిమా సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీకి ప్రముఖ జర్నలిస్ట్ టీవీ5 మూర్తి దర్శకత్వం వహించారు. తొలుత ఈ చిత్ర టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంఛ్ చేశారు. టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా.. ఇటీవల విడుదలైన టైలర్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఈ మూవీలో రోహిత్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నారు. రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేస్తామని ప్రకటించారు.
అయితే తాజాగా మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. కొన్ని రోజులపాటు విడుదల వాయిదా వేశామని.. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. మొత్తానికి ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఆధారంగా ఈ సినిమా తీసినట్లు క్లియర్‌గా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ సినిమా విడుదల వాయిదా పడటం వెనుక పెద్ద రాజకీయం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. మూవీకి తెర వెనుక సెన్సార్ పూర్తి కాకుండా చక్రం తిప్పారట. అందుకనే విడుదల వాయిదా పడిందని సమాచారం.
మూవీ ట్రైలర్ చూస్తే 1948లో జాతిపిత మహాత్మా గాంధీ మరణించినప్పుడు ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారు అంటూ హీరో వేసిన ప్రశ్న ఓ పార్టీ అధినేత తండ్రి మరణానంతరం జరిగిన పరిణామాలకు సూటిగా ప్రశ్నించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే టీజర్లోనూ "పైన కూర్చొని ఎన్ని అయినా చెబుతారు నీతులు.. మేము ఖర్చు పెట్టింది ఎవడిస్తాడు.. వాడా, వాడమ్మా మొగుడా. రూ.5లక్షల కోట్లు అప్పు తీర్చాలంటే ఎంత టైమ్ పడుతుంది.. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడుంది సార్" అనే డైలాగులు కూడా ఏపీ రాజకీయాలను గుర్తుకు తెస్తున్నాయి.
కాగా ప్రతినిధి2 చిత్రాన్ని వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ సంస్థలపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ హక్కులను డిస్ట్రిబ్యుషన్, ప్రొడక్షన్ సంస్థ అమోఘా ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. మరి కొత్త విడుదల తేదీని ఎప్పుడూ ప్రకటిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com