గౌతమీశాతకర్ణి సెట్ లో నారా రోహిత్..!

  • IndiaGlitz, [Wednesday,November 23 2016]

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న వందో చిత్రం గౌతమీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ భారీ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో నంద‌మూరి హీరోలు కానీ, నారా వారి హీరో రోహిత్ కానీ...న‌టించే అవ‌కాశం ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న‌, నారా రోహిత్ ఈ మూవీలో న‌టించేందుకు ఇంట్ర‌స్ట్ చూపించారు కూడా..! తిరుప‌తిలో ఈరోజు ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న నారా రోహిత్ ను ఈ విష‌యం పై అడిగితే...గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రంలో న‌టించ‌న‌ప్ప‌టికీ ఈ మూవీ పై ఉన్న ఆస‌క్తితో షూటింగ్ టైమ్ లో సెట్ కి వెళ్లాను.
గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి క‌థ గురించి తెలుసుకున్నాను. ఖ‌చ్చితంగా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఘ‌న విజ‌యం సాధిస్తుంది అని ఆశిస్తున్నాను అని తెలియ‌చేసారు. త‌న సినిమాల గురించి చెబుతూ...మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ లో న‌టించేందుకు నేను ఎప్పుడూ సిద్ద‌మే. జన‌వ‌రిలో రెండు సినిమాలు ప్రారంభించ‌నున్నాను అని తెలిపారు.