అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంలో రోహిత్ హీరో కాడా....?
Send us your feedback to audioarticles@vaarta.com
నారా రోహిత్ సమర్పణలో ఆరన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై విభిన్న చిత్రాల కథానాయకుడు నారా రోహిత్, ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రంలో రాయల్రాజు పాత్రలో ప్రేక్షకులను అలరించిన శ్రీవిష్ణు కథానాయకులుగా నిర్మించబడుతున్న చిత్రం `అప్పట్లో ఒకడుండేవాడు`.ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది..
అదేంటంటే ఈ చిత్రంలో నారారోహిత్ హీరో పాత్ర కాదని, శ్రీ విష్ణుయే హీరో పాత్ర చేస్తున్నాడని. సినిమా ఓ పోలీస్, దొంగ మధ్య జరిగే సినిమా. ఇందులో దొంగగా శ్రీ విష్ణు నటిస్తే, పోలీస్ పాత్రలో నారారోహిత్ నటించాడట. దొంగను పట్టుకోవడానికి నారారోహిత్ స్పెషల్ ఆఫీసర్‌గా అప్పాయింట్ చేయబడతాడట. వారి మధ్య నడిచే కథే అప్పట్లో ఒకడుండేవాడు. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇది నిజమైతే...హీరోగానే కాకుండా డిఫరెంట్ పాత్రలను చేస్తున్న నారారోహిత్ను అభినందించాల్సిందే మరి...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout