ఆ ఇద్దరు యువ హీరోలు కలిసి నటిస్తున్నారు..
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరోలు నాగ శౌర్య, నారా రోహిత్ ఈ ఇద్దరు కలసి నటిస్తున్నారా అంటే...అవుననే అంటున్నారు చిత్రయూనిట్. ఇటీవల నారా రోహిత్ హీరోగా జ్యోఅచ్చుతానంద అనే సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నారా రోహిత్ బ్రదర్ గా మరో హీరో నాగ శౌర్య నటిస్తున్నారు. ఈ చిత్రం జ్యోతి, అచ్చుత రామారావు, ఆనంద వర్ధనరావు...ఈ మూడు క్యారెక్టర్లు చుట్టూ తిరిగే వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతుంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి...ఇద్దరు యువ హీరోలు నారా రోహిత్, నాగ శౌర్య కలసి నటిస్తుండగా మరో యువ నటుడు అవసరాల శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న జ్యోఅచ్చుతానంద ఎలాంటి విజయాన్నిసాధిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments