పాత్ర కోసం బరువు తగ్గుతున్న నారా రోహిత్
Send us your feedback to audioarticles@vaarta.com
కథలో కొత్తదనం ఉంటే ఎటువంటి పాత్రనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు సీనియర్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్. పాత్ర నిడివి కూడా చూసుకోకుండా.. పాత్రకే ప్రాధాన్యతనిస్తారు కాబట్టే “విక్టరీ” అన్నది ఆయన ఇంటి పేరులా మారిపోయింది. అలాగే.. వెంకటేష్ లాగానే ఆలోచించే నటుల్లో ముందు వరుసలో ఉంటారు.. నేటి తరం కథానాయకుడు నారా రోహిత్. హీరోగా చేస్తూనే అప్పుడప్పుడు ప్రాధాన్యత కలిగిన అతిథి పాత్రలలో కూడా మెరుస్తున్నారు ఈ యంగ్ హీరో.
అటువంటి వీరిద్దరి కలయికలో ‘ఆటా నాదే వేటా నాదే’ సినిమాను తెరకెక్కిస్తున్నారు తేజ. ఈ మల్టీస్టారర్ మూవీలో వెంకీ, రోహిత్ బావ బావమరుదులుగా కనిపించనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని పాత్రకు తగ్గట్టుగా రోహిత్‌ను బరువు తగ్గమని సూచించారట దర్శకుడు తేజ. ఆ సూచన మేరకు రోజులో చాలా వరకు జిమ్‌లో కసరత్తులు చేసి 10 కిలోల మేర బరువును తగ్గించుకున్నారట నారా రోహిత్. అయితే మరో ఐదు కిలోల వరకు కూడా బరువు తగ్గాలని తేజ కోరడంతో.. రోహిత్ మరింత శ్రమించనున్నారని సమాచారం. ఈ విషయంతో నారా రోహిత్ తాను ఎంచుకునే పాత్రలకి ఎంత ప్రాధాన్యతను ఇస్తారోనని టాలీవుడ్ పరిశ్రమ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. వెంకి సరసన శ్రియ నటిస్తున్న ఈ చిత్రంలో.. నారా రోహిత్ జోడీగా ఈషా రెబ్బా సందడి చేయనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout