పాత్ర కోసం బ‌రువు త‌గ్గుతున్న నారా రోహిత్‌

  • IndiaGlitz, [Sunday,March 18 2018]

కథలో కొత్తదనం ఉంటే ఎటువంటి పాత్రనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్టరీ వెంకటేష్. పాత్ర నిడివి కూడా చూసుకోకుండా.. పాత్ర‌కే ప్రాధాన్యతనిస్తారు కాబట్టే “విక్టరీ” అన్నది ఆయ‌న ఇంటి పేరులా మారిపోయింది. అలాగే.. వెంకటేష్ లాగానే ఆలోచించే నటుల్లో ముందు వరుసలో ఉంటారు.. నేటి తరం కథానాయకుడు నారా రోహిత్. హీరోగా చేస్తూనే అప్పుడ‌ప్పుడు ప్రాధాన్యత కలిగిన అతిథి పాత్రలలో కూడా మెరుస్తున్నారు ఈ యంగ్ హీరో.

అటువంటి వీరిద్దరి కలయికలో ‘ఆటా నాదే వేటా నాదే’ సినిమాను తెరకెక్కిస్తున్నారు తేజ‌. ఈ మల్టీస్టారర్ మూవీలో వెంకీ, రోహిత్‌ బావ బావ‌మరుదులుగా కనిపించనున్నారని స‌మాచారం. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలోని  పాత్రకు త‌గ్గ‌ట్టుగా రోహిత్‌ను బరువు తగ్గమని సూచించారట దర్శకుడు తేజ. ఆ సూచన మేరకు రోజులో చాలా వరకు జిమ్‌లో కసరత్తులు చేసి 10 కిలోల మేర బరువును తగ్గించుకున్నారట నారా రోహిత్. అయితే మరో ఐదు కిలోల వరకు కూడా బరువు తగ్గాలని తేజ కోరడంతో.. రోహిత్ మరింత శ్రమించనున్నారని సమాచారం. ఈ విషయంతో నారా రోహిత్ తాను ఎంచుకునే పాత్రలకి ఎంత ప్రాధాన్యతను ఇస్తారోనని టాలీవుడ్ పరిశ్రమ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. వెంకి సరసన శ్రియ నటిస్తున్న ఈ చిత్రంలో.. నారా రోహిత్ జోడీగా ఈషా రెబ్బా సంద‌డి చేయ‌నుంది.

More News

'నేల టిక్కెట్టు' కోసం భారీ సెట్‌

సోలో హీరోగా కెరీర్‌ను మొద‌లుపెట్టిన‌ప్ప‌టి (1999) నుంచి 2015 వ‌ర‌కు ప్రతీ ఏడాది కనీసం ఒక సినిమా

సుమంత్ 25వ చిత్రం 'సుబ్రహ్మణ్యపురం' ప్రారంభం

ఇటీవల మళ్ళీ రావా వంటి ఓ వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్  హీరో సుమంత్

పంచె కట్టుతో కనువిందు చేస్తున్న సూపర్‌స్టార్‌ మహేష్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో

నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో @నర్తనశాల చిత్రం ప్రారంభం

ఛలో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా

సంగీత దర్శకురాలు యం యం శ్రీలేఖ కు 'కళారత్న' పురస్కారం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పండుగ నాడు ఇచ్చే ప్రతిష్టాత్మక 'కళారత్న ' పురస్కారం