పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో నారా రోహిత్ 'తుంటరి'
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీ కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెం.2లో నారా రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'తుంటరి'. బాణం, సోలో, సారొచ్చారు, ప్రతినిధి, రౌడీఫెలో వంటి సినిమాలతో తనదైన మార్కుతో దూసుకెళ్తున్నారు నారా రోహిత్. తాజాగా శ్రీ కీర్తి ఫిలిమ్స్ లో ఆయన నటిస్తున్న తుంటరి చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ కథను అందించిన సినిమా ఇది.
నారా రోహిత్ పక్కన లతా హెగ్దే నాయికగా నటిస్తోంది. గుండెల్లో గోదారి ఫేమ్ కుమార్ నాగేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అశోక్ బాబా, నాగార్జున్ నిర్మాతలు. దసరా సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే టీజర్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నారా రోహిత్ న్యూ లుక్తో కనిపిస్తారు. ఈ సినిమా అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.
ఈ చిత్రానికి కెమెరాః ఎం.ఆర్.పళని కుమార్, మ్యూజిక్ః సాయికార్తీక్, ఎడిటర్ః తమ్మిరాజు, ఆర్ట్ః మురళి కొండేటి, స్టంట్స్ః వెంకట్, కొరియోగ్రఫీః బాబా భాస్కర్, నిర్మాతలుః అశోక్ బాబా, నాగార్జున్, దర్శకత్వంః కుమార్ నాగేంద్ర.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments