నారా రోహిత్ 'బాల‌కృష్ణుడు' షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Wednesday,October 04 2017]

స‌ర‌శ్చంద్రిక విజ‌న‌రీ మోష‌న్ పిక్చ‌ర్స్, మాయా బ‌జార్ మూవీస్ ప‌తాకాల‌పై విల‌క్ష‌ణ న‌టుడు నారా రోహిత్‌, డెబ్యూ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ మ‌ల్లెల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'బాల‌కృష్ణుడు'. బి.మ‌హేంద్ర‌బాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నంద‌మూరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ట్రైలర్ మరియు సాంగ్స్ ను ఈనెల విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు బి.మాహేంద్ర‌బాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నంద‌మూరి మాట్లాడుతూ.. "నారా రోహిత్ గ‌త చిత్రాల‌కు భిన్నంగా 'బాల‌కృష్ణుడు' యాక్ష‌న్‌, రొమాన్స్‌, అద్భుత‌మైన పాట‌లు ఇలా అన్నీ క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో కంప్లీట్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా రూపొందింది. ఈ సినిమా కోసం తొలిసారి నారారోహిత్ సిక్స్ ప్యాక్ చేయ‌డం విశేషం. ప‌వ‌న్ మ‌ల్లెల సినిమాను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీగా అద్భుతంగా తెర‌కెక్కించారు. పృథ్వీ, వెన్నెల‌కిషోర్‌, ర‌ఘుబాబు కామెడి ట్రాక్ ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. 'న‌ర‌సింహ' చిత్రంలో నీలాంబ‌రిగా, 'బాహుబ‌లి' చిత్రంలో శివ‌గామి పాత్ర‌లోమెప్పించిన ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో న‌టించ‌డం విశేషం. మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోను ఈ నెలాఖరుకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

నారారోహిత్‌, రెజీనా కసండ్ర‌, ర‌మ్య‌కృష్ణ‌, పృథ్వీ, ఆదిత్య మీన‌న్, కోట శ్రీనివాస‌రావు, దీక్షాపంత్‌, పియా బాజ్‌పాయ్‌, అజ‌య్‌, తేజ‌స్విని, శ్రావ్య రెడ్డి, వెన్నెల‌కిషోర్‌, శివ‌ప్ర‌సాద్‌, ర‌ఘుబాబు, రామారాజు, శ్రీనివాస్‌రెడ్డి, పృథ్వీ, దువ్వాసి మోహ‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి స్టంట్స్: విజ‌య్‌, కాస్ట్యూమ్స్: న‌ర‌సింహారావ్‌, ఆర్ట్: ఆర్‌.కె.రెడ్డి, గ్రాఫిక్స్: మేట్రిక్స్ వి.ఎఫ్‌.ఎక్స్‌, క‌థ‌, మాట‌లు: కొలుసు రాజా, మ్యూజిక్: మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీ: విజ‌య్ సి.కుమార్‌, ఎడిట‌ర్: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, లైన్ ప్రొడ్యూస‌ర్: డి.యోగానంద్‌, నిర్మాత‌లు: బి.మ‌హేంద్ర‌బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నంద‌మూరి, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ప‌వ‌న్ మ‌ల్లెల‌.

More News

నవంబర్ 3న రాబోతున్న విజువల్ వండర్ 'ఏంజెల్'

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై  నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'ఏంజెల్'. సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకి రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడు. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది.

అక్టోబ‌ర్ 13న జాకీచాన్ 'ది ఫారిన‌ర్' విడుదల

జాకీ చాన్ తాజాగా న‌టించిన   చిత్రం  'ది ఫారిన‌ర్‌'. మార్టిన్ కాంపెబెల్ ద‌ర్శ‌కుడు.1992లో స్టీఫెన్ లీథ‌ర్ ర‌చించిన 'ద చైనామ్యాన్‌' న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.  వ‌ర‌ల్డ్ వైడ్‌గా  తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో  అక్టోబ‌ర్ 13న అత్య‌ధిక థియేట‌ర్స్ లో విడుద‌ల కానుంది.

వ‌ర్మ‌తో నాగ్‌...

శివ అంటే వెంట‌నే గుర్తుకు వ‌చ్చే పేర్లు రాంగోపాల్ వ‌ర్మ‌, అక్కినేని నాగార్జున‌. 26 ఏళ్ల క్రితం విడుద‌లైన ఈ సినిమా తెలుగు సినిమా స్థాయిని మార్చేసింది. నాగార్జున‌ను స్టార్‌ను చేసేసింది.

క‌మ‌ల్ స్థానంలో సూర్య‌....ఎన్టీఆర్ స్థానంలో...

ఉత్త‌రాదిన క‌మ‌ల్ హాస‌న్‌, ద‌క్షిణాదిన ఎన్టీఆర్ హోస్ట్‌లుగా ప్రారంభ‌మైన రియాలిటీ షో బిగ్ బాస్ ఫ‌స్ట్ సీజ‌న్ పూర్త‌య్యింది. మ‌రి సెకండ్ సీజ‌న్ ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా? అంద‌రూ అనుకుంటున్న త‌రుణంలో వ‌చ్చే ఏడాది ఈ బిగ్‌బాస్ సెకండ్ సీజ‌న్ ప్రారంభమ‌వుతుంద‌ని స‌మాచారం.

రీమేక్‌లో సునీల్ చేయ‌డం లేదా?

త‌మిళంలో మంచి విజ‌యాన్ని సాధించిన చతురంగ వేట్టై అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ హీరోగా న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాలో సునీల్ న‌టించ‌డం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.