'అప్పట్లో ఒకడుండేవాడు' రిలీజ్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
బాణంతో హీరోగా తెరంగేట్రం చేసిన నారా రోహిత్ విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ ప్రతినిధి, సోలో, రౌడీఫెలో, తుంటరి, జ్యో అచ్యుతానంద సహా డిఫరెంట్ మూవీస్‌లో ప్రేక్షకులను అలరించి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు నారా రోహిత్ నటించిన మరో విలక్షణ చిత్రం `అప్పట్లో ఒకడుండేవాడు`. నారా రోహిత్, శ్రీ విష్ణు, తాన్యా హోప్ హీరో హీరోయిన్లుగా నారారోహిత్ సమర్పణలో ఆరన్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మాతలుగా రూపొందిన చిత్రం `అప్పట్లో ఒకడుండేవాడు`. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కానుంది ఈ సందర్భంగా ..
చిత్ర నిర్మాతలు ప్రశాంతి, కృష్ణ విజయ్ మాట్లాడుతూ - ``ఇప్పటి వరకు రాని ఓ డిఫరెంట్స్టయిల్లో సాగే చిత్రమిది. దర్శకుడు సాగర్ కె.చంద్ర సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా 90 దశకంలో సాగుతూనే, ప్రస్తుతం కూడా రన్ అవుతుంటుంది. ఈ చిత్రానికి నారా రోహిత్‌గారు అందించిన సపోర్ట్ మరచిపోలేనిది. ఆయన సహకారంతో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగాం. సాయికార్తీక్ అందించిన పాటలకు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సురేష్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్బ్. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. సినిమాను డిసెంబర్ 30 గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.
ఈ చిత్రానికి ఎడిటింగ్ః కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీః నవీన్ యాదవ్, సంగీతంః సాయికార్తీక్, నిర్మాతలుః ప్రశాంతి, కృష్ణ విజయ్, రచన, దర్శకత్వంః సాగర్ కె.చంద్ర.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments