మదర్స్‌ డే నాడు నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్.. ట్రోలింగ్!

  • IndiaGlitz, [Sunday,May 12 2019]

కుటుంబమనే చిన్నరాజ్యం అమ్మ ఏలుబడిలో.. సంరక్షణలో సురక్షితంగా ఉంటుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. నేడు మదర్స్ డే కావడంతో నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. తల్లి పాలనాసామర్థ్యాలు అమోఘమైనవని లోకేశ్ అన్నారు. నాన్న ప్రజాసేవలో తీరికలేకుండా ఉంటే ఇటు ఇంటి బాధ్యతలను.. అటు వ్యాపార నిర్వహణను అమ్మే సమర్థవంతంగా నిర్వర్తించారని ప్రశంసలు వర్షం కురిపించారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ లోకేశ్ పాదాభివందనాలు తెలిపారు.

నారా లోకేశ్ ట్వీట్ సారాంశం..

కుటుంబమనే చిన్నరాజ్యం అమ్మ ఏలుబడిలో, సంరక్షణలో సురక్షితంగా ఉంటుంది. ఆమె పాలనాసామర్థ్యాలు అమోఘమైనవి. నాన్న ప్రజాసేవలో తీరికలేకుండా ఉంటే ఇటు ఇంటి బాధ్యతలను, అటు వ్యాపార నిర్వహణను మా అమ్మే సమర్థవంతంగా నిర్వర్తించింది. #MothersDay సందర్భంగా అమ్మలందరికీ పాదాభివందనాలు అని లోకేశ్ ట్వీట్ చేశారు.

ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు

అయ్య మాలోకం... ఇక్కడ మీ అమ్మ గురించి పొగిడావా లేదా మీ అమ్మ గారికి శుభాకాంక్షలు చెప్పావా ..??.. ఇది రాసినోడికి బుర్రుందో లేదో తెలియదు కానీ మొదలు పెట్టిన తీరు ,ముగించిన తీరుకి ఏమైనా సంభందముందా..??.. అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఈ మధ్య ట్వీట్స్ లేవ్ ఎక్కడికెళ్లావ్ ముందు ఈ సంగతి చెప్పు.. శుభాకాంక్షలు తర్వాత చెబుదువ్ గానీ మరో అభిమాని లోకేశ్‌ను ప్రశ్నించారు.

More News

'మ‌హ‌ర్షి' 3 డేస్ క‌లెక్ష‌న్స్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ 25వ చిత్రం `మ‌హ‌ర్షి` రీసెంట్‌గా విడుద‌లైంది. గురు, శుక్ర‌, శని వారాల‌కు.. అంటే సినిమా మూడు రోజుల‌కు రూ.40.59కోట్లు వ‌సూళ్ల‌ను సాధించింది.

బోయ‌పాటి టైటిల్‌తో బాల‌య్య‌

నందమూరి బాల‌కృష్ణ 105వ సినిమాకు సంబంధించిన వేగంగా జ‌రుగుతున్నాయి. జైసింహా త‌ర్వాత కె.ఎస్‌.ర‌వికుమార్ డైరెక్ట్ చేస్తోన్న చిత్ర‌మిది.

ఎంతమంది పిల్లలకైనా జన్మనిస్తానంటున్న హాట్ యాంకర్!

అన‌సూయ భ‌ర‌ద్వాజ్.. ఈ పేరు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. సాధారణ అమ్మాయిగా బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చి ఎన్నో సంచ‌ల‌నాలు సృష్టించింది.

మదర్స్ డే సంద‌ర్భంగా  చైనాలో 'మామ్‌'

శ్రీదేవి ప్ర‌ధాన‌పాత్ర‌లో ర‌వి ఉద్యావ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `మామ్‌`. శ్రీదేవి న‌టించిన 300వ చిత్ర‌మిది.

మే 24న 'లీసా 3డి'

భారీ విజువల్ గ్రాఫిక్స్ కోసం 100-200 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయాలా? 2.0 రేంజులో గ్రాఫిక్స్ చూపిస్తేనే హిట్టు కొట్టినట్టా?