మదర్స్ డే నాడు నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్.. ట్రోలింగ్!
Send us your feedback to audioarticles@vaarta.com
కుటుంబమనే చిన్నరాజ్యం అమ్మ ఏలుబడిలో.. సంరక్షణలో సురక్షితంగా ఉంటుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. నేడు మదర్స్ డే కావడంతో నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. తల్లి పాలనాసామర్థ్యాలు అమోఘమైనవని లోకేశ్ అన్నారు. నాన్న ప్రజాసేవలో తీరికలేకుండా ఉంటే ఇటు ఇంటి బాధ్యతలను.. అటు వ్యాపార నిర్వహణను అమ్మే సమర్థవంతంగా నిర్వర్తించారని ప్రశంసలు వర్షం కురిపించారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ లోకేశ్ పాదాభివందనాలు తెలిపారు.
నారా లోకేశ్ ట్వీట్ సారాంశం..
"కుటుంబమనే చిన్నరాజ్యం అమ్మ ఏలుబడిలో, సంరక్షణలో సురక్షితంగా ఉంటుంది. ఆమె పాలనాసామర్థ్యాలు అమోఘమైనవి. నాన్న ప్రజాసేవలో తీరికలేకుండా ఉంటే ఇటు ఇంటి బాధ్యతలను, అటు వ్యాపార నిర్వహణను మా అమ్మే సమర్థవంతంగా నిర్వర్తించింది. #MothersDay సందర్భంగా అమ్మలందరికీ పాదాభివందనాలు" అని లోకేశ్ ట్వీట్ చేశారు.
ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు
అయ్య మాలోకం... ఇక్కడ మీ అమ్మ గురించి పొగిడావా లేదా మీ అమ్మ గారికి శుభాకాంక్షలు చెప్పావా ..??.. ఇది రాసినోడికి బుర్రుందో లేదో తెలియదు కానీ మొదలు పెట్టిన తీరు ,ముగించిన తీరుకి ఏమైనా సంభందముందా..??.. అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఈ మధ్య ట్వీట్స్ లేవ్ ఎక్కడికెళ్లావ్ ముందు ఈ సంగతి చెప్పు.. శుభాకాంక్షలు తర్వాత చెబుదువ్ గానీ మరో అభిమాని లోకేశ్‌ను ప్రశ్నించారు.
కుటుంబమనే చిన్నరాజ్యం అమ్మ ఏలుబడిలో, సంరక్షణలో సురక్షితంగా ఉంటుంది. ఆమె పాలనాసామర్థ్యాలు అమోఘమైనవి. నాన్న ప్రజాసేవలో తీరికలేకుండా ఉంటే ఇటు ఇంటి బాధ్యతలను, అటు వ్యాపార నిర్వహణను మా అమ్మే సమర్థవంతంగా నిర్వర్తించింది. #MothersDay సందర్భంగా అమ్మలందరికీ పాదాభివందనాలు
— Lokesh Nara (@naralokesh) May 12, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout