మంత్రి నారా లోకేశ్ రాజీనామా.. యామినికి పదవి!?

  • IndiaGlitz, [Wednesday,February 20 2019]

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయనున్నారా..? త్వరలో ఎన్నికలు జరగనున్న ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా..? ఇప్పటి వరకూ ఎలాంటి పోటీ లేకుండా మంత్రి అయ్యారనే అపవాదును చెరుపుకునే ప్రక్రియలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారా..? లోకేశ్ రాజీనామా చేసిన తర్వాత టీడీపీ మహిళా నేత యామిని సాధినేనికి పదవి ఇవ్వనున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. అసలు కథేంటో ఈ కథనంలో చూద్దాం.

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్న పలువురు తెలుగు తమ్ముళ్లు, మంత్రులు ముందుగానే తమకున్న ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసేస్తున్నారు. ఇప్పటికే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌‌రెడ్డి, కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన సీనియర్ రామసుబ్బారెడ్డి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి.. జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్న నారా లోకేశ్ కూడా త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులతో ఆయన ఈ విషయమై చర్చించినట్లుగా లీకులు వస్తున్నాయి.

ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా సోమిరెడ్డి, రామసుబ్బారెడ్డి రాజీనామా చేశారు. ఈ ఇద్దరి స్థానంలో మంత్రి ఆది నారాయణరెడ్డి సోదరుడు, నెల్లూరు జిల్లా మేయర్‌‌ అబ్దుల్ అజీజ్‌లను ఎమ్మెల్సీలు చేస్తానని చంద్రబాబు మాటిచ్చేశారు. అయితే లోకేశ్ రాజీనామా చేస్తే ఆ ఎమ్మెల్సీ పదవిని టీడీపీ ఫైర్ బ్రాండ్‌‌ అయిన యామిని సాధినేనికి ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న దివ్యావాణి సైతం ఈ ఎమ్మెల్సీ పదవి కోసం పోటీ పడుతున్నారట.

కాగా.. నారా లోకేశ్ నంద్యాల నుంచి లేదా తిరుపతి సిటీ నుంచి పోటీ చేస్తారని వార్తలు వినవస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, ఎస్వీ మోహన్‌రెడ్డిలు.. లోకేశ్‌‌ కోసం తామ తమ నియోజకవర్గాలను వదులుకుంటామని స్పష్టం చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు అల్లుడి కోసం బాలయ్య తన నియోజకవర్గమైన హిందూపురంను వదులుకోవడానికి సిద్ధమయ్యారట. అయితే లోకేశ్ ఎక్కడ్నుంచి పోటీ చేస్తారో.. ప్రజలు ఏ మాత్రం ఆయన్ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి స్వాగతించి ఓట్లేస్తారా..? లేకుంటే రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రానున్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారా? అనేది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

నవ్వులు పూయిస్తున్న కేటీఆర్ ట్వీట్..

తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా సార్ తమకు ఫలానా ఆపదొచ్చిందని

ర‌కుల్ స్పెష‌ల్‌...

బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్ స్పెష‌ల్ సాంగ్స్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు. అందుకు కార‌ణం, క‌ష్టం త‌క్కువ‌.. మంచి రెమ్యున‌రేష‌న్ వ‌స్తుంది. ఇప్పుడు వీరి బాట‌లో ర‌కుల్ చేర‌నుంది.

తెలుగులో రీమేక్ అవుతున్న 'గల్లీ బాయ్'

ర‌ణ‌వీర్ సింగ్‌, అలియా భ‌ట్ నటీనటులుగా జోయా అక్తర్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన 'గ‌ల్లీబాయ్'. ఈ చిత్రం ఫిబ్రవ‌రి 14న విడుద‌లై ఊహించనంత విజయం సాధించింది.

స్ట్రింగ్ ఆప‌రేష‌న్‌లో అడ్డంగా బుక్కైన సినీ తార‌లు

ఎన్నిక‌ల త‌రుణంలో న‌ల్ల‌ధ‌నం ఎక్కువ‌గా చేతులు మారుతుంటుంది. ఇలాంటి వాటిపై పోలీసులు, అవినీతి నిరోధ‌క శాఖ‌తో పాటు ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్‌లు కూడా ఓ కన్నేసి ఉంచుతారు.

మంచి క‌థ‌, యూనిట్ స‌పోర్ట్ = 'వేర్ ఈజ్ ది వెంక‌ట‌ల‌క్ష్మీ' - నిర్మాత‌లు గుర్నాధ‌రెడ్డి, ఆనంద్ రెడ్డి, శ్రీధ‌ర్ రెడ్డి

గురునాథ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.బి.టి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాయ్ ల‌క్ష్మీ ప్ర‌ధాన పాత్ర‌లో కిషోర్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.శ్రీధ‌ర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె.రెడ్డి