Nara Lokesh:దక్షిణ భారత్ బీహార్‌గా ఏపీ మారింది: నారా లోకేశ్

  • IndiaGlitz, [Tuesday,November 07 2023]

జగన్ పాలనలో దక్షిణ భారత్ బిహార్‌గా ఏపీ మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి టీడీపీ నేతలు కలిసి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో లోకేశ్ మాట్లాడుతూ టీడీపీ సానుభూతిపరులపై ఇప్పటివరకు 60 వేల కేసులు పెట్టారని.. మాజీ సీఎం చంద్రబాబుపై ఆధారాలు లేకుండా కేసులు పెట్టిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీకి రాకుండా ఎలా అడ్డుకున్నారనే విషయాన్ని తెలియజేశామన్నారు.

17ఏ చట్టం ప్రకారం చంద్రబాబును అరెస్ట్ చేసే విషయంలో అనుమతి తీసుకోలేదని తెలిపామని.. దీనిపై వివరాలన్నీ తెప్పించుకుంటామని ఆయన చెపినట్లు వివరించారు. చంద్రబాబుపై 15 రోజులకు ఒక కేసు పెడుతున్నారని గవర్నర్‌కి తెలిపామన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌కు ఉందని.. ఆయన కాపాడతారని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు. 38 కేసులు ఉన్న దొంగోడు.. రాష్ట్రాన్ని దోచేస్తున్న దొంగోడు.. సొంత బాబాయ్‌ని చంపేసిన వాడు.. సొంత తమ్ముడుని కాపాడుకోవడానికి సీబీఐని రాష్ట్రానికి రానివ్వని జగన్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.. 10వ తేదీ రెగ్యులర్ బెయిల్‌పై విచారణ ఉంది.. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు ఉంది.. కోర్టు తీర్పులను బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా సిద్ధంగా ఉన్నామని.. భయం తమ బయోడేటాలోనే లేదని హెచ్చరించారు.దొంగ ఓట్లు చేర్చడంపై పోరాటం కొనసాగిస్తామని.. ముఖ్యమంత్రి పేరుపైనా దొంగ ఓట్లు ఉన్నాయని తెలిపారు దీనిపై రేపు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదుచేస్తామన్నారు. ఉమ్మడి కార్యాచరణపై జనసేనతో సంప్రదింపులు జరిపామని.. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు. భవిష్యత్‌లో జనసేనతో కలిసి ప్రజా ఉద్యమం చేపడతామని లోకేశ్‌ తెలిపారు.

More News

BJP:12 మందితో నాలుగో జాబితా విడుదల చేసిన బీజేపీ

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత అభ్యర్ధుల జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది.

Chhattisgarh and Mizoram:ఛత్తీస్‌గఢ్‌, మిజోరంలో ప్రశాంతం కొనసాగుతోన్న పోలింగ్..

లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.

Prime Minister Modi :హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే..

తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. పోటాపోటీ ప్రచారాలతో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి.

BRS MLC Kalvakuntla:రష్మిక డీప్ ఫేక్ వీడియో వ్యవహారం : కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి, మహిళలను కాపాడాలంటూ రాష్ట్రపతి, ప్రధానికి విజ్ఞప్తి

టాలీవుడ్ అగ్రకథానాయిక, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Rashmika:రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన సినీ, రాజకీయ ప్రముఖులు.. ఏమన్నారంటే..?

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన హీరోయిన్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియోపై సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా స్పందిస్తున్నారు.