సరికొత్త ప్రయోగం..  బిగ్‌బాస్‌లోకి నారా లోకేష్ ప్రత్యర్థి!!

  • IndiaGlitz, [Monday,July 29 2019]

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ 1,2లతో పోలిస్తే సీజన్-3 మాత్రం విజయవంతంగా దూసుకెళ్తోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరోవైపు హౌస్‌లో కంటెస్టెంట్స్ చేస్తున్న సిల్లీ పనులు, గొడవలు, కొట్లాటల మధ్య రోజురోజుకు అంచనాలు పెంచేసి.. ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఇక ఎలాగో శని, ఆదివారాల్లో నాగ్ వస్తే చాలు.. ఇక చూస్కోండి.. ఈ రెండ్రోజులు మాత్రం జనాలంతా యూట్యూబ్‌కు, టీవీలకే అతుక్కుపోతున్నారు.

సరికొత్త ప్రయోగం..!

ఇక అసలు విషయానికొస్తే.. హౌస్‌లో నుంచి మొదటిసారిగా హేమ బయటికొచ్చేశారు. దీంతో ఈమె స్థానంలో ఊహించని వ్యక్తి హిజ్రా తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేశారు. ఆదివారం షో ప్రారంభమవ్వగానే నాగ్ రెండ్ సడన్ సర్‌ప్రైజ్‌లిచ్చారు. ఇందులో ఒకటి నటి హేమ ఎగ్జిట్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తమన్నా సింహాద్రి ఎంట్రీ.. ఇవే సర్‌ప్రైజ్‌లు. కాగా ఇలా హిజ్రాలను హౌస్‌లోకి తీసుకోవడం మొదటిసారి. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్వాహకులు సరికొత్త ప్రయోగం చేశారని చెప్పుకోవచ్చు. కాగా.. హేమ ఎలిమినేట్ అయినప్పటికీ తమన్నా ఎంట్రీతో మళ్లీ 15 మంది కంటెస్టెంట్లు అయ్యారు.

కల నెరవేరింది..!

ఈ సందర్భంగా తమన్నాను నాగార్జున 15వ కంటెస్టెంట్‌గా పరిచయం చేశారు. అనంతరం నాగ్ చేతిలో నుంచి మైక్ అందుకుని.. ‘నా కల నెరవేరింది. ట్రాన్స్‌జెండర్‌ను అయిన నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నేనేంటో నిరూపించుకుంటాను. హౌజ్‌లో చివరి వరకు ఉంటాను. బయటికి వచ్చాక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను నా కుటుంబం చేసుకుంటాను’ అని తమన్నా చెప్పుకొచ్చింది.

ఎవరీ తమన్నా సింహాద్రి!!

ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి మరీ పరిచయం చేయనక్కర్లేదు.. అందరికీ ఈమె సుపరిచితమే. విజయవాడలో పుట్టిపెరిగిన తమన్నా ట్రాన్స్ జెండర్. ట్రాన్స్‌జెండర్ కావడంతో జనసేనలో తనకు టికెట్ రాకుండా వివక్ష చూపారని తమన్నా ఆరోపించిన సంగతి తెలిసిందే. నటి శ్రీరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసినప్పుడు పవన్‌కు బహిరంగంగా తమన్నా మద్దతు తెలిపింది.

మరీ ముఖ్యంగా టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి లేవెనెత్తిన క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంలో తనవంతు పాత్ర పోషించడం జరిగింది. అంతేకాదు 2019 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఇండిపెండెంట్‌గా తమన్నా పోటీ చేసింది. అయితే ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, టీడీపీ తరఫున నారా లోకేష్‌.. వైసీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేయగా.. తమన్నా మాత్రం స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఆళ్ల వరుసగా రెండోసారి గెలిచి నిలిచారు. కాగా సీఎం కుమారుడే ఈ ఎన్నికల్లో ఓటమిపాలవ్వడం అప్పట్లో తెలుగురాష్ట్రాల్లో పెద్ద చర్చే జరిగంది. అయితే లోకేశ్ ప్రత్యర్థి తమన్నాకు మాత్రం ఈ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదు.

కాగా.. తమన్నా సింహాద్రి హౌస్‌లో ఎలా మెలుగుతారో..? కలం నెరవేరిందంటూ హంగామా చేసిన తమన్నా హౌస్‌లో ఎన్ని రోజుంటుంది..? కంటెస్టెంట్లతో ఈమె ఎలా ఉంటారో తెలియాలంటే రానున్న ఎపిసోడ్‌లో ఓ లుక్కేద్దాం.

More News

పెద్దన్న 'సాహో' త‌ర్వాతే అంటున్న నిఖిల్‌

నిఖిల్ త‌మిళ చిత్రం `క‌ణిద‌న్‌`ను తెలుగులో ఏ ముహూర్తాన రీమేక్ చేయాల‌నుకున్నామో ఏమో కానీ.. విడుద‌ల‌కు చాలా అడ్డంకులు వ‌స్తున్నాయి.

రెండోసారి చిరు హీరోయిన్‌గా ?

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

విశ్వాస పరీక్షలో సునాయాసంగా గెలిచిన యడియూరప్ప

కన్నడనాట నెలకొన్న హైడ్రామాకు సోమవారంతో తెరపడిందని చెప్పుకోవచ్చు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కర్ణాటక అసెంబ్లీలో యడియూరప్ప సర్కార్ విశ్వాస పరీక్ష ఎదుర్కొంది.

బిగ్‌బాస్ హౌస్‌ నుంచి హేమ ఔట్..

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 రోజురోజుకు అంచనాలు పెంచేసి.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

'ఆత్రేయపురం ఆణిముత్యం' షూటింగ్ ప్రారంభం!!

షకలక శంకర్ కథానాయకుడిగా, రీతూ భర్మెచా కథానాయకురాలుగా "ది వన్ ఎంటర్ టైన్మెంట్స్" బ్యానర్ పై ఎం.యస్. రెడ్డి నిర్మిస్తూ, దర్శకత్వం వ‌హిస్తోన్న చిత్రం “ఆత్రేయపురం ఆణిముత్యం ”