ఆర్కే ఎఫెక్ట్.. లోకేశ్ నామినేషన్‌కు నో చెప్పిన ఆఫీసర్స్
- IndiaGlitz, [Tuesday,March 26 2019]
టీడీపీ అధినేత నారా చంద్రబాబు తనయుడు, మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ నామినేషన్‌పై తీవ్ర ఉత్కంఠం రేపుతోంది. లోకేశ్ నామినేషన్ చెల్లదని అధికారులు స్పష్టం చేశారు. నోటరీ చట్టంలోని సెక్షన్-9 ను ఈ సందర్భంగా అధికారులు ఉదహరించడం జరిగింది. నామినేషన్‌లో భాగంగా ఇంటి అడ్రస్ తాడేపల్లి మండలం ఉండవల్లిగా లోకేష్ నామినేషన్‌లో పేర్కొన్నారు. అయితే నోటరీ చేసిన వ్యక్తి కృష్ణా జిల్లాకు చెందిన లాయర్ శీతారామ్ కావడంతో నామినేషన్ చెల్లదని.. ఆయన పరిధిలోకి రాని గుంటూరు జిల్లా ను.. నోటరీ ఎలా చేస్తారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
ఆర్కే ప్రశ్నలతో నారా లోకేశ్ న్యాయవాదులు కంగుతిన్నారు. వివరణ ఇచ్చుకోలేకపోయిన లాయర్ శీతారామ్ తనకు కొంత సమయం కావాలని రిటర్నింగ్ ఆఫీసర్ వసుమాబేగాన్ని కోరారు. ఇదిలా ఉంటే.. సరైన పత్రాలు సమర్పించేందుకు గాను లోకేశ్ కు ఎన్నికల రిటర్నింగ్ అధికారి 24 గంటలు మాత్రమే గడువు ఇచ్చారు. అంటే.. ఒక్కరోజులోపు సరైన పత్రాలు ఇవ్వకపోతే నామినేషన్ చెల్లదన్న మాట.
కాగా.. నోటరీ రూల్స్ 1956 , 8,8A, 9 ప్రకారం నారా లోకేశ్ దాఖలు చేసిన నామినేషన్ చెల్లవని ఆర్కే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే పలు విషయాలపై అటు తండ్రి.. ఇటు కుమారుడితో పాటు పలు విషయాలపై ఆర్కే కోర్టు మెట్లెక్కిన విషయం విదితమే. లా చదివిన ఆర్కే ఏ విషయంలో అయినా సరే ఆఖరికి మీడియా సంస్థల అధినేతలను సైతం కోర్టు మెట్లెక్కించారు ఆర్కే.