వివేకా హత్య: తప్పులో కాలేసిన లోకేశ్
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ చూడగానే ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా..?.. అసలు వివేకా హత్య కేసు గురించి ఈయనెందుకు మాట్లాడారు..? ఈ విషయంలో ఎందుకు టంగ్ స్లిప్ అయ్యారు..? అనే సందేహాలు వస్తున్నాయ్ కదూ.. అవును మీరు వింటున్నది నిజమే.. తన ప్రసంగంలో ఇప్పటికే పలుమార్లు తప్పులో కాలేసిన లోకేశ్ అలా మాట్లాడటం పరిపాటిగా మారిపోయింది. లోకేశ్ ప్రసంగిస్తే.. ఆయన టంగ్ స్లిప్ అవ్వని.. మనకు నవ్వులు రాని రోజు ఏదైనా ఉందా అంటే బహుశా బూతద్ధం పెట్టి వెతికినా కనపడదేమో.
నారా లోకేశ్ గత ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేకుండా ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే ఈ విషయంలో లోకేశ్‌పై విమర్శలు రావడం, సీఎం కుమారుడై ఉండి పోటీకి దూరంగా ఎందుకుంటున్నారని అటు ప్రతిపక్షాలతో పాటు పలువురు సొంత పార్టీ నాయకులు సైతం అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఈ సారి ఎలాగైనా సరే ఎమ్మెల్యేగా గెలిచి తీరాలని.. ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీలైతే మరో మారు కేబినెట్లో పదవి దక్కించుకోవచ్చని లొకేశ్ తహతహలాడుతున్నారు.
ఇదిగో ఇక్కడే చినబాబు నోరు జారింది..!
మంగళగిరి పోటీ చేస్తున్న లోకేశ్ ఇప్పటికే ప్రచారం పనులు షురూ చేశారు. రెండ్రోజులుగా చినబాబు మంగళగిరి మొత్తం కలియతిరుగుతున్నారు. ఈ సీటును అటు చినబాబు.. ఇటు పెదబాబు సైతం ప్రిస్టేజ్‌గా తీసుకుని గెలవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ప్రచారంలో భాగంగా.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రస్తావనకు తెచ్చారు.
అసలు లోకేశ్ ఏమన్నారు..!?
"అలా ఉంది ఈ రోజు మన ప్రతిపక్ష పార్టీ. ఈ రోజున మీరు చూస్తున్నాం. పాపం వివేకానందరెడ్డిగారు చనిపోయారు.. అది తెలుసుకున్న మేం ‘పరవశించాం’. ఈ హత్య ఎవరు చేశారో తెలియదు కానీ..చంద్రబాబు నాయుడిపై ఆరోపణలు చేస్తున్నారు. హత్యా రాజకీయాలు చంద్రబాబుకు తెలుసా తల్లీ.." అని ఆయన ప్రచారంలో పాల్గొన్న మహిళలను లోకేశ్ అడిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. పోలింగ్ రోజు వచ్చేంత వరకు లోకేశ్ ప్రసంగంలో మున్ముంథు ఇంకెన్ని టంగ్ స్లిప్‌లు చూడాల్సి వస్తుందో.. ఏంటిీ ఖర్మ అని నెటిజన్లు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments