డైలాగ్స్‌ చెబితే... టీడీపీ చూస్తూ ఊరుకోదు ఖబడ్డార్!

  • IndiaGlitz, [Tuesday,September 10 2019]

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం నాడు ట్విట్టర్ వేదికగా తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. ‘జగన్ గారూ! పవిత్రమైన విద్యాలయాలను కూడా మీ కుల రాజకీయాలతో భ్రష్టుపట్టిస్తున్నారెందుకు? ఎస్వీ యూనివర్సిటీలో అన్ని అర్హతలుండీ, ఆరేళ్ళుగా విధులు నిర్వహిస్తున్న టీచింగ్ అసిస్టెంట్లను ఎందుకు తొలగించారు? మీకు కావాల్సిన ఒక సామాజిక వర్గం కోసం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం చేస్తారా?

మీ వైసీపీ కార్యకర్తలను అడ్డదారిలో యూనివర్సిటీలోకి పంపించి పునరావాసం కల్పించిన ఈ ఘటనపై విచారణ జరగాలి. ఏ కారణంతో ఉన్నవారిని తీసేసారు? ఏ ప్రాతిపదికన కొత్తవారిని తీసుకున్నారో ప్రజలకు తెలియాలి. అధికారపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడితే అంతుచూస్తామంటూ విద్యార్థులను పోలీసులతో బెదిరిస్తారా?

ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇష్టానుసారం అక్రమాలు చేస్తుంటే ప్రశ్నించే హక్కు ప్రతి సామాన్యుడికి ఉంది. ఆ హక్కును కాలరాసి, గొంతు నొక్కేస్తాం, అణగదొక్కేస్తాంలాంటి డైలాగులు ప్రజాస్వామ్యంలో చెప్తే... తెలుగుదేశం చూస్తూ ఊరుకోదు ఖబడ్ధార్!’ అంటూ లోకేష్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. అయితే లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ నుంచి ముఖ్యంగా వైసీపీ ఎంపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

More News

ఆడ పిల్ల వేటాడాల‌నుకుంటే మ‌గ సింహం కుక్కే

RX 100తో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టిస్తోన్న మ‌రో చిత్రం `RDX లవ్`తో త్వ‌ర‌లోనే మ‌న ముందుకు రానుంది.

‘పూజా’ జర జాగ్రత్త లేకుంటే అంతే సంగతులు!

పూజా హెగ్దే.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచి ఇప్పటి వరకూ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

దమ్ముంటే బయటికొచ్చి మాట్లాడు ‘420 తాతయ్యా’!

టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపించట్లేదు. రోజుకో సోషల్ మీడియా వేదికగా అధికార,

అల్లు అర్జున్-సుకుమార్ కాంబో కథ మారింది!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో దర్శకుడు సుకుమార్ కాంబోలో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో

అఖిల్‌కు నో చెప్పేసిన పూజా హెగ్డే

అఖిల్ అక్కినేని హీరోగా న‌టిస్తోన్న నాలుగో చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో