వెంకన్నా.. నీ కొండను నువ్వే కాపాడుకో : నారా లోకేశ్
Send us your feedback to audioarticles@vaarta.com
మే-01న టీటీడీ చైర్మన్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు వైవీ సుబ్బారెడ్డి జన్మదినం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వెంకన్న సన్నిధిలో ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. అయితే లాక్‌డౌన్ ఉండటంతో మీరెలా అక్కడ వేడుకలు జరుపుకున్నారు..? మీకు లాక్‌డౌన్ వర్తించదా అంటూ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వైవీపై ధ్వజమెత్తారు.
నువ్వే కాపాడుకో సామీ..!
‘ఆపద మొక్కుల వాడా, అనాథ రక్షకా! నీకు పేద, ధనిక అనే తేడా లేదంటారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో సామాన్యులకు నీ దర్శన భాగ్యమే లేదు, కానీ వైస్ తోడల్లుడు సకుటుంబ సమేతంగా వచ్చేసరికి నీ గుడి తలుపులు ఎలా తెరిచారయ్యా!. దేవదేవుడి ఉత్సవాలతో అలరారిన తిరుమల గిరులు నిర్మానుష్యంగా మారినవేళ, నిబంధనలు తుంగలో తొక్కి నీ సన్నిధిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అపరాధం కాదా! ఏడుకొండలే లేవన్నోళ్లు నువ్వున్నావంటే నమ్ముతారా? నీ కొండను నువ్వే కాపాడుకో స్వామీ!’ అని లోకేశ్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించగా.. చాలా మంది ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. అయ్యా సారూ.. ఆయన టీటీడీ చైర్మన్ అనుమతి ఎందుకు ఉండదు మిడి మిడి జ్ఞానంతో కాదు కాస్త ఆలోచించు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆపదమొక్కులవాడా! అనాథరక్షకా! నీకూ పేదా పెద్ద తేడాల్లేవంటారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో సామాన్యులకు నీ దర్శనభాగ్యమే లేదు. వైఎస్ తోడల్లుడు సకుటుంబ సమేతంగా వచ్చేసరికి నీ గుడి తలుపులు ఎలా తెరిచారయ్యా! (1/2) pic.twitter.com/y5WhI47l1r
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) May 2, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com