Jr NTR Fans: జూ.ఎన్టీఆర్ అభిమానులపై లోకేష్ సైన్యం దాడి.. సర్వత్రా ఆగ్రహావేశాలు..

  • IndiaGlitz, [Monday,January 08 2024]

టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరులో నిర్వహించిన రా.. కదలిరా సభా ప్రాంగణంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర అవమానం జరిగింది. తారక్ ఫొటోతో ఉన్న జెండాలను ఆయన అభిమానులు ప్రదర్శించారు. దీంతో ఇది గమనించిన లోకేష్ సైన్యం ఎన్టీఆర్ జెండాలు, ఫ్లెక్సీలను ఎందుకు తీసుకొచ్చారంటూ వారిపై దాడికి దిగారు. అది కూడా చంద్రబాబు ఎదురుగానే రెచ్చిపోయారు. జై ఎన్టీఆర్ నినాదాలు వినపడకుండా సభ నుంచి బయటకు తోసేశారు. దీంతో చంద్రబాబు, లోకేష్‌లపై తారక్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదేనా తాత పెట్టిన పార్టీలో సొంత మనవడు ఎన్టీఆర్‌కు ఇచ్చే గౌరవం అని నిలదీస్తున్నారు.

నందమూరి కుటుంబానికి చెక్..

దివంగత నందమూరి తారక రామారావు.. తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే ఆయనకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పార్టీని కబ్జా చేశారనే జగమెరిగిన సత్యం. అప్పటి నుంచి పార్టీలో నందమూరి కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత లేకుండా వస్తున్నారు. దివంగత నందమూరి హరికృష్ణను కూడా ఎన్నో సార్లు చంద్రబాబు అవమానించారు. ఆయనకు సరైన గుర్తింపు లేకుండా ఏదో తూతూమంత్రంగా పదవులు ఇచ్చేవారు. దీంతో కొన్ని సార్లు చంద్రబాబుపై హరికృష్ణ తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. మరో నందమూరి వారసులు బాలకృష్ణను కూడా ప్రచారం వరకే వాడుకునేవారు. పార్టీ బాధ్యతలు అప్పగించేవారు. అయితే ఆయన నుంచి పార్టీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త బాలయ్య కుమార్తె బ్రాహ్మణిని తన కుమారుడు లోకేష్‌కి ఇచ్చి వివాహం చేశారు. ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబాన్ని ద్వితీయ శ్రేణి పాత్రకు మాత్రమే పరిమితం చేశారు.

లోకేష్ పెత్తనంపై తీవ్ర ఆగ్రహం..

2014లో హిందూపురం ఎమ్మెల్యే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బాలయ్యకు ఎన్టీఆర్ వారసుడిగా గుర్తించి కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అదే ఆయన కుమారుడు లోకేష్‌కు మాత్రం ఎమ్మెల్యే పదవి లేకుండానే ఎమ్మెల్సీ చేసి మరీ మంత్రి పదవి కట్టబెట్టారు. అంటే తన తర్వాత లోకేష్‌కే పార్టీ పగ్గాలు ఇవ్వాలన పన్నాగాలు పన్నారు. ఇప్పుడు చంద్రబాబు తర్వాత లోకేషే పార్టీ పెత్తనం చూసుకుంటున్నారు. ఇది చాలా మంది సీనియర్ నేతలకు మింగుడు పడటం లేదు. నందమూరి కుటుంబం పెట్టిన పార్టీలో వారికే ప్రాధాన్యత లేకుండా చేయడంలో చంద్రబాబు తనదైన కుట్రలు పనుతున్నారు.

ఇదేనా..? మనవడికి ఇచ్చే ప్రాధాన్యత..

అందుకే 2009 ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్‌ను భయంకరంగా వాడుకుని ఆ తర్వాత పక్కన పెట్టేశారు. తాత పెట్టిన పార్టీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తీవ్రంగా ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. దీంతో అప్పటి నుంచి ఎన్టీఆర్‌ను మెల్ల మెల్లగా పక్కన పెట్టడం చేశారు. ఇక 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎన్టీఆర్ మాటే వినపడకుండా చేశారు. తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసం తారక్‌ను మూలన పడేశారని పార్టీలోని ఓ వర్గం నేతలు ఇప్పటికీ ఆరోపిస్తూ ఉంటారు. సీఎం జగన్ రాజకీయ వ్యూహాలు ముందు అసలే జవసత్వాలు కోల్పోయిన పార్టీ తిరిగి గాడిలో పడాలంటే దివంగత ఎన్టీఆర్ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తారక్ అభిమానులు కూడా తాత పార్టీని కాపాడుకునే హక్కు మనవడికి ఉందని చెబుతూ ఉంటున్నారు.

పార్టీ పగ్గాలు చేపట్టేది ఎన్టీఆర్‌నే..

కానీ చంద్రబాబు మాత్రం తన ముద్దుల కుమారుడు లోకేష్‌కు పార్టీ పగ్గాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇది తారక్ అభిమానులకు మింగుడుపడటం లేదు. అందుకే అవకాశం వచ్చిన ప్రతిసారీ తారక్ ఫొటోలు ప్రదర్శిస్తూ తమ అభిమానం, అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు. తాజాగా తిరువూరులో జరిగిన సభలో కూడా ఇదే చేశారు.. కానీ లోకేష్ ప్రైవేట్ ఆర్మీ మాత్రం ఎన్టీఆర్ అభిమానులను చితకబాది బయటకు గెంటేశారు. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. సొంత పార్టీలో మనవడికి చోటు లేకుండా చూడాలని కుట్రలు పన్నుతారా అని ఫైర్ అవుతున్నారు. ఎప్పటికైనా తమ హీరో పార్టీ పగ్గాలు చేపట్టి కాబోయే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

More News

PM Modi:అంతరిక్షంలో ఆదిత్య ఎల్-1' ప్రయోగం సక్సెస్.. ప్ర‌ధాని మోదీ హర్షం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO)మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. సూర్యుడి రహస్యానాలను అధ్యయనం చేసేందుకు నింగిలోకి పంపి ఆదిత్య ఎల్‌-1(Aidtya L1)

Anganwadi workers:అంగన్‌వాడీ వర్కర్లపై 'ఎస్మా' అస్త్రం సంధించిన ప్రభుత్వం

తమ డిమాండ్లు నెరవేర్చాలని నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

Kesineni Nani: పొమ్మనలేక పొగబెట్టారా..? కేశినేని నానికి చంద్రబాబు చెక్..

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అసలు స్వరూపం బయటపడుతోంది. ఇప్పటిదాకా పార్టీ మనుగడ కోసం నాటకాలు ఆడిన చంద్రబాబు అసలు విశ్వరూపం ఇప్పుడు బయపటపడింది.

KTR:హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్ రద్దుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా ఈరేస్‌(FEO) రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన మున్సిప‌ల్ శాఖ‌..

Thandel:ఈపాలి ఏట గురితప్పదేలే.. చైతూ'తండేల్' గ్లింప్స్ అదిరింది..

అక్కినేని హీరో, యువ సామ్రాట్ నాగచైతన్య(Naga Chaitanya)హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో