Nara Lokesh:స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఈనెల 12వరకు లోకేశ్ ముందస్తు బెయిల్ పొడిగింపు
Send us your feedback to audioarticles@vaarta.com
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్‌ను ఈ నెల 12 వరకు కోర్టు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లోకేశ్ ముందస్తు బెయిల్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. నేటితో బెయిల్ గడువు ముగుస్తుందని లోకేశ్ తరపు న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అయితే తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని.. వచ్చే బుధవారానికి విచారణను వాయిదా వేయాలని సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తన వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు లోకేశ్ ముందస్తు బెయిల్ గడువులను వచ్చే బుధవారం వరకు పొడిగించింది.
అరెస్ట్ చేయకుండా 41ఏ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు..
ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని లోకేశ్ హైకోర్టును ఆశ్రయించగా.. అరెస్ట్ చేయకుండా 41ఏ నోటీసులు ఇవ్వాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 4 వరకు ముందస్తు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీలో ఉన్న లోకేశ్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని కోరారు. ఏపీ ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కేసుల్లో లోకేశ్ పేరును సీఐడీ చేర్చింది. ఈ రెండు కేసుల్లో ఏపీ హైకోర్టులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారణ జరపాలని కోర్టును లోకేశ్ కోరారు.
ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిట్ పిటిషన్ డిస్మిస్..
అయితే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో లోకేశ్ నిందితుడు కాదని.. సీఐడీ నిందితుడిగా చేరిస్తే 41ఏ నోటీసు ఇస్తామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. కాగా స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో గత 25 రోజుల నుంచి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout