Nara Lokesh:స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఈనెల 12వరకు లోకేశ్ ముందస్తు బెయిల్ పొడిగింపు

  • IndiaGlitz, [Wednesday,October 04 2023]

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్‌ను ఈ నెల 12 వరకు కోర్టు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లోకేశ్ ముందస్తు బెయిల్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. నేటితో బెయిల్ గడువు ముగుస్తుందని లోకేశ్ తరపు న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అయితే తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని.. వచ్చే బుధవారానికి విచారణను వాయిదా వేయాలని సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తన వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు లోకేశ్ ముందస్తు బెయిల్ గడువులను వచ్చే బుధవారం వరకు పొడిగించింది.

అరెస్ట్ చేయకుండా 41ఏ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు..

ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని లోకేశ్ హైకోర్టును ఆశ్రయించగా.. అరెస్ట్ చేయకుండా 41ఏ నోటీసులు ఇవ్వాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 4 వరకు ముందస్తు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీలో ఉన్న లోకేశ్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని కోరారు. ఏపీ ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కేసుల్లో లోకేశ్ పేరును సీఐడీ చేర్చింది. ఈ రెండు కేసుల్లో ఏపీ హైకోర్టులో లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారణ జరపాలని కోర్టును లోకేశ్ కోరారు.

ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిట్ పిటిషన్‌ డిస్మిస్..

అయితే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో లోకేశ్ నిందితుడు కాదని.. సీఐడీ నిందితుడిగా చేరిస్తే 41ఏ నోటీసు ఇస్తామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. కాగా స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో గత 25 రోజుల నుంచి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

More News

Ramcharan:మిస్టర్ కూల్ ధోనీని కలిసిన రామ్‌చరణ్.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్..

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో

Bandi Sanjay:ప్రధాని మోదీ వ్యాఖ్యలతో కేసీఆర్ కుటుంబంలో చీలిక వచ్చింది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నిజామాబాద్‌లో ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.

Vande Bharat :వందేభారత్ స్లీపర్ కోచ్‌ల డిజైన్లు విడుదల.. 2024 మొదట్లో అందుబాటులోకి..

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వందే భారత్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 వందే భారత్ రైళ్లు పట్టాలపై తిరుగుతున్నాయి.

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు .. స్పందించని జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. పెడనలో జరగనున్న తన వారాహి యాత్రలో దాడులు చేస్తారని..

Asian Games:ఆసియా క్రీడల్లో భారత పతకాల వేట.. ఆర్చరీలో బంగారు పతకం

ఆసియా క్రీడల్లో భారత్ ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. పతకాల వేటలో దూసుకుపోతున్నారు. తాజాగా ఆర్చరీ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో