'నిజం గెలవాలి' యాత్ర ప్రారంభించిన భువనేశ్వరి.. బాధిత కుటుంబాలకు పరామర్శ..
Send us your feedback to audioarticles@vaarta.com
'నిజం గెలవాలి' యాత్రను టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభమైంది. నారావారిపల్లెలో ఆమె తండ్రి, టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఆవేదన చెంది మరణించిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. యాత్రలో భాగంగా తొలిరోజు తిరుపతి జిల్లా చంద్రగిరిలో ప్రవీణ్‌రెడ్డి, నేండ్రగుంటలో చిన్నబ్బ నాయుడు కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఆయా కుటుంబాలకు చెరో రూ.3లక్షల చెక్కును అందజేశారు. ధైర్యంగా ఉండాలని తాము అండగా ఉంటామని భువనేశ్వరి భరోసా ఇచ్చారు.
చంద్రబాబు లేకుండా తొలిసారి.. భువనేశ్వరి భావోద్వేగ ట్వీట్..
తొలి విడత యాత్రలో భాగంగా చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఆమె పర్యటిస్తారు. పరామర్శలతో పాటు బహిరం సభలు, మహిళలతో ముఖాముఖి కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. అంతకుముందు చంద్రబాబు లేకుండా తొలిసారిగా తిరుమలకు వెళ్లానని ఈ ప్రయాణం భారంగా ఉందంటూ ఆమె భావోద్వేగ ట్వీట్ చేశారు. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే తాను చంద్రబాబు జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారి పల్లె వెళ్లానని వాపోయారు. ఈ ప్రయాణం తనకు ఎంతో బాధ కలిగించిందని.. ప్రతి నిమిషం భారంగా గడిచిందన్నారు. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నానని తెలిపారు.
గ్రామ దేవతలైన దొడ్డి గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు..
యాత్ర చేపట్టేందుకు మంగళవారం తిరుపతి జిల్లా చేరుకున్న భువనేశ్వరి.. ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం నేరుగా కుప్పంలోని నారావారి పల్లెకు చేరుకుని.. పెద్దల సమాధులకు నివాళులర్పించారు. ఆ తర్వాత గ్రామ దేవతలైన దొడ్డి గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆమెతో పాటు టీడీపీ ఎమ్మెల్సీలు పంచమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, రాజగోపాల్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జ్ పులివర్తి నాని, తదితర నాయకులు ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments