Nara Bhuvaneswari: 'నిజం గెలవాలి' పేరుతో పరామర్శ యాత్రకు రంగంలోకి దిగిన నారా భువనేశ్వరి
Send us your feedback to audioarticles@vaarta.com
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రాజకీయ రణరంగంలో అడుగుపెట్టారు. ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లోకి వచ్చారు. ఆయన అరెస్టును జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే 'నిజం గెలవాలి' పేరుతో ఆమె బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా బాబు అరెస్ట్ వార్తలతో మనస్తాపం చెంది మరణించిన అభిమానులు, టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. బాబు అక్రమ అరెస్టును జనాల్లోకి తీసుకెళ్లనున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భువనేశ్వరి..
యాత్ర చేపట్టేందుకు తిరుపతి జిల్లా చేరుకున్న భువనేశ్వరి.. ముందుగా తిరుమల శ్రీవారిని భువనేశ్వరి దర్శించుకున్నారు. అనంతరం నేరుగా కుప్పంలోని నారావారి పల్లెకు చేరుకుని.. పెద్దల సమాధులకు నివాళులర్పించారు. ఆ తర్వాత గ్రామ దేవతలైన దొడ్డి గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆమెతో పాటు టీడీపీ ఎమ్మెల్సీలు పంచమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. రేపటి నుంచి భువనేశ్వరి పరామర్శ యాత్ర మొదలుకానుంది. చంద్రబాబు అరెస్ట్‌తో మనోవేదనతో మృతిచెందిన టీడీపీ కార్యకర్త చిన్నబ్బ కుటుంబాన్ని తొలుత పరామర్శించనున్నారు. మూడు రోజులపాటు తిరుపతి జిల్లాలో ఆమె యాత్ర చేయబోతున్నారు.
పల్లె ప్రజలతో సహపంక్తి భోజనం..
బుధవారం ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో పల్లె ప్రజలతో కలిసి భువనేశ్వరి సహపంక్తి భోజనం చేయనున్నారు. అనంతరం అగరాల బహిరంగసభలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రసంగించనున్నారు. గురువారం తిరుపతిలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసనల నేపథ్యంలో పోలీసు కేసులు నమోదైన టీడీపీ-జనసేన కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. తదుపరి ఆటో డ్రైవర్లతో ఆమె సమావేశం కానున్నారు. ఇక ఈనెల 27న శ్రీకాళహస్తిలో మహిళలతో భువనేశ్వరి సమావేశం అవుతారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout