Nara Bhuvaneshwari:దళితులపై బూతులతో మండిపడ్డ నారా భువనేశ్వరి.. ఆడియో వైరల్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ ఎన్నికలు పీక్ స్టేజ్‌కి చేరాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. ఓవైపు అధికార వైసీపీ సభలకు ప్రజలు పోటెత్తుతుంటే.. టీడీపీ కూటమి సభలకు ప్రజల నుంచి స్పందన లేదు. దీంతో టీడీపీ నేతల్లో ఓటమి భయం కనపడుతోంది. ఈ క్రమంలో తమ నోటికి పనిచెబుతున్నారు. తాజాగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. దళితులను పచ్చి బూతులు మాట్లాడినట్టుగా ఒక ఆడియో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది.
ఆ ఆడియోలో దళితుల కులం పుట్టుక గురించి చాలా దారుణంగా మాట్లాడినట్టుగా ఉంది. దీంతో భువనేశ్వరి ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఎవరినో ఆమె బూతులు తిడుతున్నట్టు ఉంది. దళితులనే ఆమె ఘోరంగా తిట్టారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన అక్క చెప్పినా తాను పట్టించుకోలేదని... వీళ్లంతా బతకనివ్వరని అసహనంతో అన్న మాటలు అందులో ఉన్నాయి. ఈ ఆడియోలో జరిగిన సంభాషణ ఎమ్మెల్యే సీటు గురించి అన్నట్టుగా వినిపిస్తోంది.
"నేను నీకంటే పెద్దింట్లో పుట్టిన దాన్ని.. మీరు చెత్త బుట్టలో పుట్టారు.. అయినా వేషాలు వేస్తున్నారు.. దేనికి పనికిరాని అడుక్కుతినే వెధవల్లారా అంటూ... నానా బూతులు తిడుతోంది భువనేశ్వరి. నేను మీ అందరిని మానిటరింగ్ చేస్తానా.. తప్పుడు నా కొడకా.. ఉడికం చేసే వెధవ.. పనికిరాని.. ల..కొడుకా.. ముష్టి నా కొడకా" అంటూ పచ్చి బూతులు ఉన్నాయి. దీంతో ఆమె మాటలపై దళితులు, వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.
కాగా టీడీపీ నేతలకు తొలి నుంచి దళితులంటే చిన్న చూపు అని ఫైర్అవుతున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారంటూ వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దళితుల పట్ల ఇంత వివక్ష చూపిస్తున్న తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments