సుదీర్‌బాబు నటించిన 'నన్నుదోచుకుందువటే' చిత్రం మెదటి లుక్
Send us your feedback to audioarticles@vaarta.com
సమ్మెహనం లాంటి మంచి విజయం తో మంచి దూకుడుమీద వున్న హీరో సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ లో టాలెంట్డ్ దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే .. ఈ చిత్రం విభిన్నమైన కోణంలో, కొత్త స్క్రీన్ ప్లేతో, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథతో, మంచి నిర్మాణ విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. నభ నతేశ్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. టైటిల్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ చిత్రం యోక్క మెదటి లుక్ ని విడుదల చేశారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పార్ట్ పూర్తయింది. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తారు.
ఈసందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ... సుధీర్ బాబు గారు హీరోగా సుదీర్‌బాబు ప్రోడక్షన్స్ లో నన్నుదోచుకుందువటే అనే చిత్రాన్ని చేస్తున్నాము. టైటిల్ ఎనౌన్స్ చేయ్యగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పడు ఈ చిత్రం యోక్క మెదటి లుక్ ని విడుదల చేసాము. ఈ చిత్రం ప్రోడక్షన్ విలువలు ఎక్కడా తగ్గకూడదు అనే సంకల్పంతోనే సుధీర్‌బాబు గారు చేస్తున్నారు. కథ చాలా ఫ్రెష్ గా వుంది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభ నతేశ్ చాలా బాగా చేసింది. అజనీష్ సంగీతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేశాం. త్వరలోనే మిగతా వివరాలు ఎనౌన్స్ చేస్తాం. అని అన్నారు.
నటీనటులు.. సుధీర్ బాబు, నభ నతేశ్, నాజర్, తులసి, వేణు, రవి వర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments