2 నుంచి స్పెయిన్ లో తారక్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్లో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్పి పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో..'. విజయదశమి కానుకగా విడుదలైన 'నాన్నకు ప్రేమతో..' టీజర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండస్ వచ్చింది. ఈరోజు దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దానికీ చాలా చక్కటి స్పందన వచ్చింది.
లండన్‌లో ఈ చిత్రానికి సంబంధించి 60 రోజులపాటు ఓ భారీ షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 2 నుంచి స్పెయిన్‌లో 20 రోజులపాటు చివరి షెడ్యూల్ జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్ పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా మా 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితరులు నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments