నాన్నకు ప్రేమతో..టీజర్ రిలీజ్..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం నాన్నకు ప్రేమతో..ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రిగా రాజేంద్రప్రసాద్ నటిస్తుండగా...నెగిటివ్ రోల్ లో జగపతిబాబు నటిస్తున్నారు. ఎన్టీఆర్ ను సరికొత్తగా చూపిస్తూ...సుకుమార్ తెరకెక్కిస్తున్న నాన్నకు ప్రేమతో ..టీజర్ ను దసరా సందర్భంగా ఈనెల ఈ నెల 21న రిలీజ్ చేయనున్నారు. ఆడియోను డిసెంబర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసి..సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. మరి...సుకుమార్ ఎన్నో ఆశలు పెట్టుకున్న నాన్నకు ప్రేమతో...ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments