'నాన్నకు ప్రేమతో' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
నటీనటులు - ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, మధుబాల, రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్ తదితరులు
సంగీతం - దేవిశ్రీ ప్రసాద్
కెమెరా - విజయ్ చక్రవర్తి
ఆర్ట్ - రవీందర్
ఫైట్స్ - పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్
ఎడిటింగ్ - నవీన్ నూలి
బ్యానర్ - శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పి, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాత - బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - సుకుమార్
ఒకే ఎమోషనల్ మూమెంట్స్‌ను క్యారీ చేసే ఇద్దరు వ్యక్తులు ఎన్టీఆర్, సుకుమార్‌ల ఆలోచన శైళిని కలయికతో రూపొందిన చిత్రమే నాన్నకు ప్రేమతో..అంటే నాన్నపై ప్రేమను తెలియజేయడానికి దర్శకుడు సుకుమార్ తన నాన్న చివరి దశలో ఉండగా రాసుకున్న కథ నచ్చిన ఎన్టీఆర్ సుకుమార్ గత చిత్రం నేనొక్కడినే ప్లాప్ అయినా నమ్మకంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి సుకుమార్ తనదైన స్టయిల్లో విలక్షణమైన రివేంజ్ ఫార్ములా మైండ్ గేమ్‌తో రూపొందించిన నాన్నకు ప్రేమతో ఎలాంటి సక్సెస్ ఇచ్చిందో తెలుసుకోవాలంటే సినిమా కథలోకి ఎంట్రీ కావాల్సింది.
కథ
రమేష్ చంద్ర ప్రసాద్ అలియాస్ సుబ్రమణ్యం(రాజేంద్ర ప్రసాద్)ను కృష్ణమూర్తి కౌటిల్య మోసం చేయడంతో రోడ్డున పడతాడు. అతనికి ముగ్గురు కొడుకులు. వారిని చాలా కష్టపడి పెంచి పెద్ద చేస్తాడు. చివరకు ఓ వ్యాధి బారిన పడిన సుబ్రమణ్యం ఒక నెలలో చనిపోతాడని డాక్టర్లు చెబుతారు. అప్పుడు అతని కొడుకులు అతని చివరి కోరిక ఏంటని అడుగుతారు. తనని కృష్ణమూర్తి చేసిన మోసం సంగతిని తెలియజేసిన సుబ్రమణ్యం ఆఖరి కోరికను తీర్చడానికి మూడో కొడుకు అభిరామ్(ఎన్టీఆర్) ప్లాన్ చేస్తాడు.తనతో పాటు మరో ముగ్గురు తాగుబోతు రమేష్, నవీన్, ఫారిన్ గర్ల్‌ను తన ప్లాన్‌లో భాగం చేసుకుంటాడు. అందులో భాగంగా కృష్ణమూర్తి కూతురు దివ్యాంక(రకుల్)ను ప్రేమలో పడేస్తాడు. ఆమె సహాయంతో కృష్ణమూర్తిని కలుస్తాడు. కానీ కృష్ణమూర్తి, అభిరామ్‌కు అతని ప్లాన్ ఏంటో చెప్పి షాకిస్తాడు. అప్పుడు అభిరామ్ ఏం చేస్తాడు? తన తండ్రి కోరికను నేరవేరుస్తాడా? లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్
ఎన్టీఆర్ ఎనర్జిట్ పెర్ఫార్మెన్స్తో ఆద్యతం ఆకట్టుకున్నాడు. డ్యాన్సులు, ఫైట్సతో అలరించాడు. డైలాగ్ డెలివరీ కూడా కొత్తగా కనపడింది. ముఖ్యంగా లుక్ విషయంలో ఎన్టీఆర్ చాలా స్టయిలిష్‌గా కనిపించాడు. అలాగే ఐ వాంట్ టు ఫాలో ఫాలో యు ...అనే పాటను పాడి సినిమాకు తన వంతుగా సపోర్ట్ అందించాడు. సుకుమార్ తనదైన శైళిలో సినిమాను రిచ్‌గా, స్టయిలిష్ గా తెరకెక్కించాడు. దేవిశ్రీ మ్యూజిక్ బావుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. విజయ్ చక్రవర్తి సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. ముఖ్యంగా యూరప్ అందాలను చాలా ప్లెజెంట్‌గా తెరకెక్కించాడు.నిర్మాణ విలువలు బావున్నాయి.
మైనస్ పాయింట్స్
నాన్నను మోసం చేసిన వ్యక్తి మోసం చేయడ అనేది దర్శకుడు సుకుమార్ సినిమా కోసం ఎంపిక చేసుకున్న కాన్సెప్.అయితే సినిమాను అసాంతం సీరియస్‌గా తీసుకెళ్ళడంతో ఎక్కడా కామెడి ఎంటర్టైనింగ్ కనపడదు. సినిమాలో మధుబాల క్యారెక్టర్‌ను చూపించడం, ఆమెను జైలులో వేయడం వంటి సీన్స్ చూసిన ప్రేక్షకుడుకి ఆమె చేసిన తప్పెంటో తెలియదు. రూత్ లెస్ బిజినెస్‌మేన్, అంతలా ఆలోచించే ఓ కన్నింగ్ పర్సన్ అంత సులువుగా ఎలా మోసపోతాడనేది కూడా ఆలోచించాల్సిందే. ఎడిటింగ్‌లో సినిమాను మరింత ఎడిట్ చేసుంటే బావుండేది. అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్‌కు సరైన ముఖ్యత్వం లేకపోవడం.ఫస్టాఫ్‌లో వచ్చే కిడ్నాపింగ్ ఫైట్‌లో హీరో చెప్పే సైన్స్ లాజిక్స్ ఒకే కానీ అందరి ఆడియెన్స్‌కు ఇది కనెక్ట్ కాదు. అలాగే క్లయిమాక్స్‌లో డాక్టర్లు చనిపోయిడని చెప్పిన హీరో తండ్రి బ్రతకడం ఎంత వరకు సరైనదో తెలియడం లేదు.
విశ్లేషణ
ఎన్టీఆర్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఇమేజ్‌కు దూరంగా చేసిన ఓ మంచి ప్రయత్నం. కానీ ఈ సినిమాను బి, సి సెంటర్స్‌లోని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారని చెప్పలేం. ఎందుకంటే సినిమా వారి రియల్ లైఫ్‌కు చాలా దూరంగా ఉండటమే. నేను ఎప్పుడూ ఈ గేమ్ ఓడిపోలేదని విలన్ అంటే,,,అసలు నేను ఓడిపోయే గేమ్ ఆడలేదని హీరో అనడం, కొన్ని పగిలిపోయిన వస్తువులు అతుక్కున్న చాలా అందంగా ఉంటాయని హీరో, హీరోయిన్ దగ్గర చెప్పే డైలాగ్ సహా కొన్ని డైలాగ్స్ బావున్నాయి. ఐ వాంటు ఫాలో ఫాలో యు..అని ఎన్టీఆర్ సాంగ్‌ను బాగానే పాడాడు. క్లయిమాక్స్‌లో తన తండ్రి కోసం హీరో పడే తాపత్రయం, ఆ సందర్భంలో నాన్న నేను నువ్వు చనిపోవడం ఆపను కానీ, ఒక్క క్షణం నాకోసం కళ్ళు తెరువు అనే ఎమోషనల్ సీన్ బావుంది.
బాటమ్ లైన్
నాన్నకు ప్రేమతో…` ఎమోషనల్ ఎంటర్ టైనర్
రేటింగ్: 3/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com