ఆ రోజుతో 'నాన్నకు ప్రేమతో' పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
'టెంపర్' వంటి బంపర్ హిట్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బ్యాలెన్స్ ఉన్న పాటని హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో తీయనున్నారని సమాచారమ్. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 18తో 'నాన్నకు ప్రేమతో' చిత్రీకరణని పూర్తిచేయాలని చిత్రయూనిట్ భావిస్తోందట. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments