ఎన్ఠీఆర్ 50 కోట్లు క్రాస్ చేస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
నటుడుగా పదిహేనేళ్ళు, హీరోగా 25 సినిమాలు చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం నాన్నకు ప్రేమతో...`. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలైన ఈ చిత్రం ముందుగా డివైడ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ తర్వాత పుంజుకుంది. బాహుబలి తర్వాత 1775 థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజున 12కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన ఈ చిత్రం మూడు రోజుల్లో ముప్పై కోట్లను సాధించింది. ఇదే ఊపును కొనసాగిస్తే తొలివారంలోనే 50 కోట్లను క్రాస్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ ఊపుతో తొలిసారి ఎన్టీఆర్ 50 కోట్ల క్లబ్ లో చేరుతాడా? లేదా? అని చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments