తల్లిదండ్రులకు మేమిచ్చే నీరాజనమే నాన్నకు ప్రేమతో... - యంగ్ టైగర్ ఎన్టీఆర్
- IndiaGlitz, [Monday,December 28 2015]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం నాన్నకు ప్రేమతో...దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ఆడియో సీడీలను కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్ ఆవిష్కరించి తొలి సీడీని నందమూరి హరికృష్ణకు అందించారు. ఈ సందర్భంగా...
నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ నాన్నగారు ఈ రాష్ట్ర ప్రజలకు బాగు కోసం ఆలోచించారు. కష్టపడ్డారు. నందమూరి వంశం బాగుండాలని అభిమానులు ఎప్పుడు కోరుకుంటున్నారు. సినిమా పేరు నాన్నకు ప్రేమతో.. అని పెట్టడం వల్ల ఈరోజు నాన్నగారిని గుర్తుకు తెచ్చుకోవాలి. నాకు ముగ్గురు కొడుకులు. అందులో జానకిరామ్, కళ్యాణ్‌రామ్ పేర్లను నాన్నగారే పెట్టారు. జూనియర్ విషయానికి వస్తే నేనే తారకరామ్ అనే పెట్టాను. బ్రహ్మర్షి విశ్వామిత్ర సమయంలో ఓసారి నాన్నగారు నన్ను పిలిచి నీ మూడో కొడుకు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడని అడిగారు. చదువుకుంటున్నాడని చెప్పగానే ఓసారి పిలిపించమన్నారు ఎన్టీఆర్‌ను తీసుకెళ్ళాను. అక్కడ వెళ్ళగానే ఆయన తారక్‌ను చూసి నీ పేరేంటి అనడిగారు. తాతగారు, నాన్నగారు నాకు తారకరామ్ అనే పేరు పెట్టారు' అని అనగానే నీది నా అంశ, నా పేరు నీకుండాలి అని అన్నారు. . ఈ సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ నటించిన 25వ సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్‌గారు, సుకుమార్‌గారు నాకు పరిచయం లేకున్నా వారి సినిమాలు చూస్తుంటాను. దేవిశ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తిగారితో నాకు మంచి అనుబంధం ఉంది. జగపతిబాబుగారి కంటే వారి నాన్నగారు రాజేంద్రప్రసాద్‌గారితో మంచి పరిచయం ఉండేది. ఈ సినిమా ఆడియో సత్యమూర్తిగారికి అంకితం చేయడం ఆనందంగా ఉంది అన్నారు
ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇది నా 25వ సినిమా. నేను నటుడిని అవుతానని అనుకోలేదు. 25 సినిమాు చేస్తానని అనుకోలేదు. నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నన్ను వెన్నుతట్టి ధైర్యం చెప్పి ప్రోత్సాహించింది నా తండ్రిగారు నందమూరి హరికృష్ణగారు. ఇన్ని సినిమాలు చేయడానికి కారణమైన దేవుళ్లు మా తాతగారు, మా నాన్నగారు. మాకు ఎప్పుడూ పిరికిపందల్లా బతకమని చెప్పలేదు. మీరు మీరుగా బ్రతకమని, పోరాడమని అన్నారు. ప్రతి తల్లిదండ్రులకు మేమిచ్చే నీరాజనమే నాన్నకుప్రేమతో..చిత్రం. ఈ సినిమా పుట్టిందే సుకుమార్‌గారి తండ్రిగారి వల్లే. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ను చూడరు. సుకుమార్ తండ్రిని చూస్తారు. అలాగే ఎన్టీఆర్‌ను చూడరు. సుకుమార్‌గారిని చూస్తారు. ఇది సుకుమార్‌గారి నాన్నగారి కథ. సుకుమార్‌గారి తండ్రికి ట్రిబ్యూట్ ఇవ్వడం కోసం చేసిన సినిమా, ఆయన కొనఊపిరితో ఉన్నప్పుడు పుట్టిన కథ. సుకుమార్ గారు బాధను దిగమింగుకుని రాసిన కథ. ఇలాంటి దర్శకుడు మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో పుట్టడు. సుకుమార్‌గారు కథను రాయరు. జీవితాన్ని రాస్తారు. ప్రతి డైలాగ్‌లో జీవితం ఉంటుంది. ఇలాంటి గొప్ప సినిమా. కథ నా 25వ సినిమాగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దేవిశ్రీగారు ఈ సినిమా కోసం గొప్ప త్యాగం చేశారు. జగపతిబాబుగారు అన్నీ రకాలుగా నా హృదయానికి చాలా క్లోజ్‌గా ఉండే మనిషి. గొప్ప నటుడు, గొప్ప స్టార్. ప్రతినాయకుడుగా చేసి తన నటనతో ఈ సినిమాకు ప్రాణం పోశాడు. ఆయన లేకుంటే ఈ సినిమా చేసుండలేకపోయేవాడిని. రాజేంద్రప్రసాద్‌గారు వంటి డేడికేషన్ ఉన్న నటుడితో చేయడం హ్యపీగా ఉంది. నిర్మాత ప్రసాద్‌గారు ఎంతో సపోర్ట్ చేశారు. నాన్నకు ప్రేమతో..' 25వ సినిమా కాదు. ఈ సినిమా ఎమోషనల్ జర్నీ. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఆశీస్సులు అందిస్తారని భావిస్తున్నాను'' అన్నారు.
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ నాన్నకు ప్రేమతో అంటే ఒక కొడుకు నాన్న మీద ప్రేమతో ఏం చేశాడనేదే ఈ సినిమా. నేను చూసిన వారిలో మా నాన్నగారంతా గొప్ప కొడుకును చూడలేదు. ఎందుకంటే మా తాతగారి కోసం పెళ్ళైన తర్వాత కూడా క్ష కిలోమీటర్లు చైతన్యరథం నడిపారు. నాకు పదేళ్ళు వచ్చే వరకు నాన్నగారు ఎలా ఉండేవారు నాకు తెలియదు. తన తండ్రి కోసం ఆయన అంత డేడికేషన్‌తో వర్క్ చేశారు. కంటికి రెప్పలా కాపాడుకున్నారు. లక్ష కిలోమీటర్లు వాహనాన్ని నడిపారు. కాళ్ళకు బొబ్బలు ఎక్కినా తండ్రి కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా కోసం తమ్ముడు ఎంతో తపన పడ్డాడు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కొత్త ఎన్టీఆర్ కనపడతాడు. సుకుమార్‌గారు అద్భుతమైన కథను, సినిమాను ఇచ్చారు. దేవిశ్రీగారు ఇచ్చిన మ్యూజిక్ తో 2016కి బెస్ట్ ఆల్బమ్ అవుతుంది''అన్నారు.
సుకుమార్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలో మన విజయాన్ని నిస్వార్ధంగా ప్రేమించేది తల్లిదండ్రులు మాత్రమే. తారక్ మాస్‌గా కనిపించే క్లాస్ మనసున్న హీరో. ఈ టైటిల్లో హార్ట్ బీట్ టచ్ కనపడుతుంది. ఆ టచ్ ఇచ్చింది తారక్. తను మంచి సింగర్ కూడా.. తనతో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. జగపతిబాబుగారు డైరెక్షన్ టీంను బాగా సపోర్ట్ చేశారు. ఈ కథకు ఉన్న ప్యూర్ ఎమోషన్ మా నాన్నగారు. ఆ ఎమోషన్‌ను ఈ సినిమాలో చూపెట్టడానికి ప్రయత్నించాను. నిర్మాత ప్రసాద్‌గారు నాకు తండ్రిలాంటి వారు. సపోర్ట్ చేసిన థాంక్స్'' అన్నారు.
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ఇంత మంచి లైఫ్ ఇచ్చిన మా నాన్నగారు సత్యమూర్తిగారికి, అమ్మగారికి థాంక్స్. నాన్నగారు నాకు చాలా సపోర్ట్ గా ఉండేవారు. నాన్నగారు లేకపోవడం బాధగా ఉంది. అయితే నేను బాధలో ఉన్నప్పుడు నాకు అండగా అందరికీ థాంక్స్. ఎన్టీఆర్‌తో కలిసి ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది'' అన్నారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ ఈ సినిమా కచ్చితంగా సూపర్ డూపర్‌హిట్ అవుతుంది నేను, ఎన్టీఆర్ కలిసి ఆది చేస్తామా? అదుర్స్ చేస్తామా? అని తెలియదు కానీ త్వరలోనే సినిమా చేస్తాం. సుకుమార్ అండ్ టీంకు ఆల్ ది బెస్ట్'' అన్నారు.
జగపతిబాబు మాట్లాడుతూ దేవిశ్రీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. 2016లో ఇదే బెస్ట్ ఆల్బమ్ అవుతుంది. తారక్ ఎనర్జీ లెవల్స్, ఫ్రెండ్షిప్ లెవల్ వేరు. మంచి టాలెంటెడ్. బాగా అ్లరి చేస్తాడు. తారక్‌తో పనిచేయడం ఎంజాయ్ చేశాను. సుకుమార్ ఈ చిత్రంతో ఓ కొత్తఫార్ములా పరిచయం చేశాడు. ఈ చిత్రంలో విలన్ అయిన నన్ను కూడా హీరోలా చూపించాడు. చాలా కాలం తర్వాత నటించాల్సి వచ్చింది. చాలా బ్యాడ్ క్యారెక్టర్ చేశాను'' అన్నారు.
సిబాషి సర్కార్ మాట్లాడుతూ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్స్ కలిసి చేస్తున్న నాలుగో ప్రాజెక్ట్ ఇది. ఎన్టీఆర్‌గారు 25వ సినిమాలో మేం పార్ట్ కావడం ఆనందంగా ఉంది'' అన్నారు.
ఈ కార్యక్రమంలో కొరటాల శివ, చంద్రబోస్, భాస్కరభట్ల, జయేష్ రంజన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్ కనకా, అవసరా శ్రీనివాస్, సితార, అమిత్, తాగుబోతు రమేష్, గిరి, నవీన్ తదితయి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ: విజయ్ చక్రవర్తి, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటు: చంద్రబోస్, డాన్స్: రాజు సుందరం, శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుధీర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.