ఎన్టీఆర్ మూవీ ఆడియో రిలీజ్ డేట్..

  • IndiaGlitz, [Wednesday,December 02 2015]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'నాన్న‌కు ప్రేమ‌తో'. ఈ చిత్రం కోసం తార‌క్ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ లుక్కే సినిమాకి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా మారి ఎటెన్ష‌న్ పొందుతోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. విశేష‌మేమిటంటే.. ఈ సినిమాకి సంగీత‌మందిస్తున్న దేవిశ్రీ ప్ర‌సాద్‌, హీరో తార‌క్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రాల ప‌రంగా.. సంక్రాంతికి వ‌స్తున్న మూడో సినిమా ఇది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో వేడుకను డిసెంబర్ 20 లేదా 23న నిర్వహించాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుందట. మరి డిసెంబర్ 20న గుంటూరులో డిక్టేటర్ ఆడియో విడుదల ఉండటం కూడా కీలకం కానుంది.