నాన్నకు ప్రేమతో.. ఆడియో డేట్ ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం నాన్నకు ప్రేమతో..ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. బి.విఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ప్రస్తుతం నాన్నకు ప్రేమతో..సినిమా చివరి షెడ్యూల్ స్పెయిన్లో జరుగుతుంది. ఈ నెల 20కి షూటింగ్ పూర్తవుతుంది. ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ మూవీకి యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం...నాన్నకు ప్రేమతో...ఆడియోను ఈ నెల 25న అంగరంగ వైభవంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. మరి...ఎన్టీఆర్, సుకుమార్..ఎన్నో ఆశలు పెట్టుకున్న నాన్నకు ప్రేమతో...ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com