ఎన్టీఆర్..కి ఎన్ ఈసారైనా కలిసొచ్చేనా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఇక సినిమా వాళ్లకు అయితే..సెంటిమెంట్ మరీ ఎక్కువుగా ఉంటుంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే...ఎన్ అనే ఇంగ్లీషు అక్షరంతో ప్రారంభమైన ఎన్టీఆర్ సినిమాలు నిన్ను చూడాలని, నాగ, నా అల్లుడు, నరసింహుడు చిత్రాలు ప్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన 25 చిత్రం నాన్నకు ప్రేమతో...ఈ సినిమా టైటిల్ కూడా ఎన్ అనే ఇంగ్లీషు అక్షరంతోనే ప్రారంభం అవుతుంది.
ఈ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి నాన్నకు ప్రేమతో...అనే టైటిల్ కన్ ఫర్మ్ చేసే ముందు ఈ సెంటిమెంట్ గురించి ఆలోచించారట. అప్పుడు ఇంగ్లీషు అక్షరం ఎన్ ఎన్టీఆర్ కి కలసి రావడం లేదు కనుక మా నాన్నకు ప్రేమతో...అని పెడతారని ప్రచారం జరిగింది. కానీ..ఫైనల్ గా నాన్నకు ప్రేమతో...టైటిల్ ఫిక్స్ చేసారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న నాన్నకు ప్రేమతో... రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి..ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో...సెంటిమెంట్ ని ఫాలో అయి ఫ్లాప్ అవుతుందా..? లేక సెంటిమెంట్ ను క్రాస్ చేసి సక్సెస్ అవుతుందా అనేది తెలియాలంటే జనవరి 13 వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments